బుధవారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు రూ.43,04,988/- విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పేద వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఈ పధకాలలో కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు ఒక వరం లాంటిదని అన్నారు, గత నెలలో రాష్ట్రంలో 12 లక్షల 50 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని అన్నారు, ఏ రాష్ట్రంలో కూడా పేదవారి కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు అని చెప్పారు.కళ్యాణ లక్ష్మి ద్వారా ఈరోజు మెదక్ పట్టణం మెదక్ మండలం సంబంధించి 43 మంది లబ్ధిదారులకు రూ.43,04,988/- చెక్కుల తో పాటు ఒక చీరను అందజేయడం జరిగిందని అన్నారు.కెసిఆర్ కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ,1,00116/- ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.
కరోనా కష్టకాలం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపథకాన్ని కూడా ఆపలేదని అన్నారు, ప్రతి పేదవారు కెసిఆర్ కి ఎంతో రుణపడి ఉండాలన్నారు.
చెక్కులను అందించిన సమయంలో మహిళల కళ్ళలో కనిపించిన ఆనందం వెలకట్టలేనిదన్నారు, లబ్ధిదారుల తరపున కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి,మెదక్ ఎంపీపీ యమునా జై రామ్ రెడ్డి, మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్,మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్ వసంత రాజ్, విశ్వం, నర్వ లక్ష్మీనారాయణ, మేఘమాల,మెదక్ పట్టణ మండలం అధ్యక్షులు గంగాధర్,అంజా గౌడ్, ఏఎంసి డైరెక్టర్ సాప.సాయిలు,నాయకులు రాగి అశోక్, లింగ రెడ్డి, మేడి.మధుసూదన్ రావు, దుర్గాప్రసాద్ సాయిరాం, కృష్ణ, జయరాం రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, సాంబశివరావు రవీందర్,ఆంజనేయులు, సర్పంచ్ ప్రభాకర్,మెదక్ ఆర్ఐ చంద్రశేఖర్, వీఆర్ఏలు ఎల్లం,వేణు తదితరులు పాల్గొన్నారు







