అఖిల్, అరియానాలకు అసలు అర్హతే లేదు.. పరువు తీసిన అనిల్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రాథోడ్ గురించి మనందరికీ తెలిసిందే.అయితే అనిల్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అన్న విషయం తెలిసిందే.

 Anil Rathod On Akhil Sarthak Ariyana In Bigg Boss Non Stop Buzz With Anchor Ravi Anil Rathod, Akhil Sarthak, Ariyana, Bigg Boss Non Stop, Baba Bhasker , Anchor Ravi , Anchor Shiva-TeluguStop.com

హౌస్ లో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ తనకు ఇచ్చిన టాస్క్ మాత్రం 100% ఎఫెక్ట్ పెట్టి పూర్తి చేసేవాడు.తన పనేదో తాను అన్నట్టుగా వ్యవహరించేవాడు.

కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనిల్ యాంకర్ రవి ఇంటర్వ్యూ లో భాగంగా పాల్గొని తన మనసులో మాటలను కూడా బయట పెట్టేసాడు.

 Anil Rathod On Akhil Sarthak Ariyana In Bigg Boss Non Stop Buzz With Anchor Ravi Anil Rathod, Akhil Sarthak, Ariyana, Bigg Boss Non Stop, Baba Bhasker , Anchor Ravi , Anchor Shiva-అఖిల్, అరియానాలకు అసలు అర్హతే లేదు.. పరువు తీసిన అనిల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాంకర్ రవి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో టాప్ 7 కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.

అనిల్ రాథోడ్, బాబా భాస్కర్, మిత్ర శర్మ,అరియానా, శివ, అఖిల్ లు బయటకు వచ్చేయ గా బిందుమాధవి మాత్రం ఫైనల్ గా విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో యాంకర్ రవి అందర్నీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఫ్రీ పాస్ గురించి బాబా భాస్కర్ ను అడగగా.అప్పుడు బాబా భాస్కర్ ఏదో రకంగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ తరువాత డబ్బులు తీసుకున్నావు.నువ్వు ఎలిమినేట్ అవుతావు అని నీకు ముందే తెలుసా అంటూ అరియానాను ప్రశ్నించగా.అవును అంటూ సమాధానం ఇచ్చింది అరియానా.ఆ తర్వాత అనిల్ ను నీ దృష్టిలో టాప్ త్రీ అనర్హులు ఎవరు అని అడగగా.ఆ విషయంపై స్పందించిన అనిల్.అరియానా,బాబా భాస్కర్,అఖిల్ అని సమాధానమిచ్చాడు.

యాంకర్ శివ మూడో స్థానంలో ఉన్న నాకు కూడా డబ్బులు ఇస్తే తీసుకెళ్లే వాడిని అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube