రానున్న రోజుల్లో కాపీ కొట్టి మరి ఎగ్జామ్స్ రాయొచ్చ..?

అమ్మో.! పరీక్షలు వస్తున్నాయి ఏమి చేయాలి, ఎలా రాయాలో? ఏంటో అసలు సిలబస్ ఏమి చదవలేదు.ఈసారి ఫెయిల్ అయితే ఇంట్లో అమ్మా నాన్న తిడతారు.అని చాలామంది విద్యార్థులు పరీక్షలంటే భయపడిపోతూ ఉంటారు.అలాగే మరికొంత మంది పరీక్షల మీద భయంతో, పాస్ అవ్వాలనే తాపత్రయంతో పరీక్షల్లో కాపీ కొట్టడం, స్లిప్స్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.ఎవరయినా గాని దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని అంటారు కదా అలాగే పరీక్షల్లో కాపీ కొట్టినప్పుడు ఎవరు చూడకపోతే పర్వాలేదు కానీ.

 Telangana Sbtet Introducing Open Book System In Polytechnic Courses , Telangana,-TeluguStop.com

ఎవరన్నా చూస్తే మాత్రం అది చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళని డీబార్ చేస్తుంటారు.అయితే ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయాయి.

ఇకపై పరీక్ష హాల్లో కాపీ కొట్టినాగాని అది నేరం కాదు.ఎగ్జామినర్ చూస్తాడని భయపడకుండా ఎంచక్కా పుస్తకాలు ముందు పెట్టుకొని మరి పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సమాదానాలు రాయవచ్చు.

నూతన విధానం కూడా ఈ సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కోర్సుల్లో ఈ ఏడాది నుండే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (SBTET) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.అయితే ఓపెన్ బుక్ విధానం పట్ల చాలాకాలంగా కసరత్తులు జరుగుతున్నాయి.

ఈ విధానాన్ని ఇప్పటికే కొన్ని యూనివర్శిటీల్లో ఈ ఓపెన్ అమలు చేసారు.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఓపెన్ బుక్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు.

Telugu Exams, Latest, System, Telangana, Telangana Sbtet-Latest News - Telugu

ఈ ఓపెన్ బుక్ విధానం పట్ల విద్యార్థులు ఆనందంగా ఉన్నాగాని ఒక విషయం మాత్రం మరిచిపోతున్నారు.అదేంటంటే పరీక్షల్లో చూసి రాయడం అంటే ఈజీనే కదా అని అనుకుంటారు కానీ ఈ ఓపెన్ బుక్ సిస్టంలో పరీక్ష తీరుతో పాటు ప్రశ్నలు కూడా డిఫరెంట్ గా అడుగుతారు.ప్రశ్నను అర్ధం చేసుకుని పుస్తకంలో అ ప్రశ్నకి జవాబు ఎక్కడ ఉంటుందో అని వెతకాలంటే అ సబ్జెక్టుపై పూర్తి అవగాహన అనేది ఉండాలి.లేదంటే ఒక ప్రశ్నకు జవాబు వెతకడానికి ఉన్న సమయం కాస్త అయిపోతుంది.

అందుకనే ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ఉన్నాగాని సబ్జెక్టుపై పూర్తి అవగాహన అనేది చాలా ముఖ్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube