పవన్ ఇందుకే రోడ్డుపై పడుకున్నారా ? 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scam )లో సిఐడి అధికారులు అరెస్టు చేయడం రాజకీయంగా ఏపీలో పెద్ద కలకలమే రేపింది.చంద్రబాబు అరెస్టు వార్త తెలియగానే ప్రముఖులంతా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) హైదరాబాదు నుంచి హుటాహుటిన ఏపీకి రోడ్డు మార్గంలో బయలుదేరి వచ్చారు.

 Janasena Pawan Kalyan Supporting Chandrababu Naidu, Ap Cm Ys Jagan,chandrababu A-TeluguStop.com

ప్రత్యేక విమానం ద్వారా రావాలని ముందుగా భావించినా,  హైదరాబాదులో పోలీసులు అనుమతి నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో బయలుదేరి వచ్చారు.

Telugu Ap Cm Ys Jagan, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan-Politics

ఏపీలో అడుగుపెట్టగానే చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) ను నిరసిస్తూ పవన్ రోడ్డుపై పడుకుని తన నిరసనను తెలియజేశారు.దీనిపై మీకు విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై పవన్ స్పందించారు.కోనసీమలో రెండు వేల మంది నేరగాళ్లను దింపాలని , 50 మందిని చంపేయాలని పథకం పన్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు .ఏపీలో శాంతిభద్రతలకు సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు .ప్రశ్నించే వారిపై హత్య కేసులు నమోదు చేస్తున్నారని పవన్ ఆరోపించారు.  శనివారం తనను అన్ని రకాలుగా అడ్డుకున్నారని అందుకే దానికి నిరసనగా రోడ్డుపై పడుకున్నానని పవన్ తెలిపారు.తనలాంటి వాడికి ఇలాంటి నిర్బంధం ఉంటే , ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పవన్ నిలదీశారు.

 తాను రోడ్డుపై పడుకుని నిరసన తెలిపేలా వైసిపి వాళ్లే చేశారని పవన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు .

Telugu Ap Cm Ys Jagan, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan-Politics

మనకోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు వారికి మద్దతు ఇవ్వడం పద్ధతి అని అన్నారు .నాయకుడిని అరెస్ట్ చేస్తే మద్దతుగా అభిమానులు వస్తారని, ఇది ప్రజాస్వామ్యంలో భాగమేనని పేర్కొన్నారు.తణుకు, భీమవరంలో వారాహి యాత్ర( Varahi Yatra ) పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారని, ప్రజలను ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రయత్నించారని పవన్ ఆరోపించారు.ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని , అసలు చట్టాలు సరిగ్గా పనిచేస్తే బెయిల్ పై వచ్చిన వారు సీఎం కాలేరని , అక్రమంగా డబ్బు సంపాదించిన వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని పవన్ విమర్శించారు.

ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులతో ప్రతిపక్షాలకు బలం పెరిగిందని,  ఓవైపు జీ 20 వంటి పెద్ద సదస్సు జరుగుతుంటే,  మరోవైపు ఇక్కడ నాయకులను అరెస్టులు చేశారని పవన్ అన్నారు.ప్రపంచ దేశాల అధ్యక్షులు వచ్చిన సమయంలో అలజడులు సృష్టించారని , జి20 ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టు చేసినట్లు ఉందని,  ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తాను తీసుకు వెళ్తానని పవన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube