ఖురాన్‌ను అగౌరవ పరిచారని పాపం క్రైస్తవ జంటను ఏం చేశారో చూడండి!

పాకిస్తాన్‌లోని( Pakistan ) లాహోర్‌ నార్త్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇపుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది.దానికి కారణం ముస్లింల మత గ్రంధం అయినటువంటి ఖురాన్.

 Christian Couple Arrested For Desecration Of Quran In Lahore Details, Christian-TeluguStop.com

( Quran ) అవును, ఖురాన్ కాపీని అపవిత్రం చేశారనే ఆరోపణలపై దైవదూషణ కేసు నమోదు కావడంతో ఒక క్రైస్తవ జంటను( Christian Couple ) అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదే విషయాన్ని అక్కడి స్థానిక మీడియాలు తెలపడంతో అంతర్జాతీయ మీడియాలకు కూడా ఈ వార్త పాకింది.

Telugu Blasphemy, Lahore, Latest, Nri, Pakistan, Quran, Taimoor-Latest News - Te

ఇదే విషయంపైన హర్బన్స్ పురాకు చెందిన తైమూర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అతను రేంజర్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని ఒక వీధిలోని ఒక ఫుడ్ షాప్ వద్ద నిలబడి ఉండగా, ఆ దగ్గరలోని ఇంటి పైకప్పు నుండి కొన్ని పేజీలు విసిరివేయబడటం చూశానని, ఆ పేపర్లు ఖురాన్‌కు సంబంధించినవి అని అతడు చెప్పాడని అక్కడి డాన్ పత్రిక రిపోర్ట్‌ చేసింది.ఈ క్రమంలో ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.ఒక మహిళ తలుపు తెరిచి తన మైనర్ కుమార్తెలు, కొడుకు పేపర్లను విసిరి ఉండవచ్చని మహిళ ప్రతిస్పందించిందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు సదరు వ్యక్తి.

Telugu Blasphemy, Lahore, Latest, Nri, Pakistan, Quran, Taimoor-Latest News - Te

ఈ నేపధ్యంలోనే మిస్లింల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేశారనే ఆరోపణలపై నార్త్ కంటోన్మెంట్ పోలీసులు( North Cantonment Police ) మహిళ, ఆమె భర్తపై దైవదూషణ కేసు( Blasphemy Case ) నమోదు చేశారు.పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-బి కింద కేసు నమోదు చేశారు.నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, ఇప్పుడు చట్టపరమైన చర్యల కోసం ఎదురుచూస్తున్నామని ఎస్పీ అవైస్ షఫీక్ మీడియాకు చెప్పుకొచ్చారు.ఆగష్టు 16న హింసాత్మక ఎపిసోడ్ నేపథ్యంలో ఒక గుంపు దాదాపు 2 డజన్ల చర్చిలను దోచుకోవడం, నిప్పంటించడం, క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై దాడి చేయడం, జరన్‌వాలాలోని అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని మీరు వినే వుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube