పక్షవాతానికి స్ట్రోక్ అని కూడా పిలుస్తారు.అయితే పక్షవాతం( Paralysis ) బారిన పడితే మాత్రం జీవితమే పూర్తిగా మారిపోతుంది.
ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.మెదడులో రక్త సరఫరా పై అంతరాయం కలిగినప్పుడు ఈ స్ట్రోక్( Stroke ) వస్తుంది.
లేదా మెదడులో రక్తస్రావం జరిగినప్పటికి కూడా ఇలా బ్రెయిన్ స్ట్రోక్( Brain Stroke ) వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు సరైన చికిత్స త్వరగా తీసుకుంటే నయమయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.వాటిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక బలహీనంగా అనిపించడం, అకస్మాత్తుగా తిమ్మిరిపట్టడం లాంటివి జరుగుతాయి.మరి ముఖ్యంగా చెప్పాలంటే కాలు, చేయి ఒకవైపు మాత్రమే లాగుతూ ఉంటాయి.నవ్వినప్పుడు ఒకవైపు ముఖం లాగినట్టు అనిపిస్తుంది.
ఇది స్ట్రోక్ వస్తుందని చెప్పడానికి ఒక సూచన.ఇక మాటలు కూడా అస్పష్టంగా వస్తాయి.
అంతేకాకుండా మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు.ఇవన్నీ కూడా స్ట్రోక్ వల్ల కావచ్చు.
ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.ఇక అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు.
అంతా గందరగోళంగా కనిపిస్తారు.అలాంటివారు స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది.
అలాగే తలనొప్పి( Headache ) అకస్మాత్తుగా వచ్చి పోతూ ఉంటుంది.అయితే రక్తస్రావం కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంది.తలలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చి పోతుందంటే అది మెదడులో రక్తస్రావం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.అలాగే చూపు( Eyesight ) కూడా అస్పష్టంగా మారిపోతుంది.ఎదురుగా ఉన్న వస్తువులు ఒకటి రెండుగా కనిపించడం మొదలవుతుంది.అంతేకాకుండా మైకం కమ్మినట్టు కూడా అనిపిస్తుంది.
ఇక నడిచే సమయంలో కూడా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది.ఇలా ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అంటే స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు అని ముందే గ్రహించి దీనికి సంబంధించిన చికిత్స తీసుకుంటే ఈ పరిస్థితిని దాటవేయవచ్చు.