బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి వారిలో కంటెస్టెంట్ రతిక ( Rathika ) ఒకరు.ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన తరువాత రెండు వారాలకు సింగర్ రాహుల్ తో ప్రేమలో ఉన్నట్టు కొన్ని వీరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలా తమ ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాహుల్( Rahul ) ఈ ఫోటోలపై స్పందిస్తూ కావాలనే ఈ ఫోటోలను రతిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఇమేజ్ కాస్త డామేజ్ చేసేలా చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.అయితే తాజాగా ఈ వార్తలపై రతిక సిస్టర్ స్పందిస్తూ వీరిద్దరి లవ్ బ్రేకప్ గురించి అలాగే ఫోటోలు లీక్ అవడం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రతిక మిస్టర్ మాట్లాడుతూ అక్క రాహుల్ ఇద్దరు ప్రేమించుకున్న మాట వాస్తవమే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.ఈ విషయం మా నాన్నకు చెప్పడంతో నాన్న కూడా అందుకు ఒప్పుకొని వారి కుటుంబంతో మాట్లాడారు పెళ్లి కూడా ఫిక్స్ అయింది అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరి పెళ్లి బ్రేకప్ అయ్యింది అంటూ రతిక సిస్టర్ వెల్లడించారు.పెళ్లికి ముందే రాహుల్ తన అక్కకు చాలా కండిషన్స్ పెట్టారు పెళ్లి తర్వాత తాను ఇండస్ట్రీకి దూరం కావాలని బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ కండిషన్స్ పెట్టారు ఇవన్నీ తనకు నచ్చకే బ్రేకప్ చెప్పుకున్నారని తెలిపారు.
ఇక వీరి ఫోటోలు లీక్ అవ్వడం గురించి రతిక సిస్టర్ మాట్లాడుతూ వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు రాహుల్ వద్ద ఉండాలి అలాగే మా అక్క వద్ద ఉండాలి మా అక్క బిగ్ బాస్ కి వెళ్లిన తరువాత ఈ ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి.బిగ్ బాస్ లోకి వెళ్లిన ఆమె ఈ ఫోటోలను ఎలా లీక్ చేయగలదు.ఈ ఫోటోలు బయటకు రావడానికి రాహుల్ కారణమంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఒక ఆడపిల్ల ఇలాంటి ఫోటోలను బయటకు పెట్టి తన పరువు పోగొట్టుకోవాలని అనుకోదు ఈ ఫోటోలను రాహుల్ లీక్ చేశారని మేము అనుకుంటున్నాము అంటూ ఈ సందర్భంగా రతిక రాహుల్ లవ్ స్టోరీ బ్రేకప్ గురించి రతిక సిస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.