బి‌ఆర్‌ఎస్ కు మజ్లిస్ షాక్ ఇవ్వనుందా ?

తెలంగాణ ఎన్నికలు( Telangana elections ) దగ్గర పడుతున్న కొద్ది పొత్తు రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్య పొత్తు వ్యవహారం ఇప్పటికే ఊగిసలాడుతోంది.

 Will Majlis Shock Brs , Brs, Telangana Elections, Kcr, Majlis Party, Bjp , Congr-TeluguStop.com

అలాగే మజ్లిస్ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీల( BRS parties ) మద్య ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయింది.వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు రెండు నెలల ముందే బి‌ఆర్‌ఎస్ ప్రకటించిన తొలి జాబితాతో స్పష్టమైంది.

మజ్లిస్ పార్టీతో కలిసి గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని 29 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామని ఆ మద్య కే‌సి‌ఆర్( KCR ) చెప్పుకొచ్చారు.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మజ్లిస్ పార్టీ బి‌ఆర్‌ఎస్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Telugu Congress, Majlis, Telangana-Politics

మైనారిటీ ఓటు బ్యాంకు ను అత్యంతా ప్రభావితం చేసే ఏంఐఏం పట్ల కే‌సి‌ఆర్ మొదటి నుంచి కూడా సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు.మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న కే‌సి‌ఆర్ సాధారణ ఎన్నికలు వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఏంఐఏం తోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై( BJP , Congress parties ) వ్యతిరేకత చూపే మైనారిటీ ఓటర్లు బి‌ఆర్‌ఎస్ వైపు తిరగాలంటే మజ్లిస్ పార్టీ దోస్తీ చాలా అవసరం.అందుకే ఏం ఐ ఏం కోరిన సీట్లు ఇవ్వడానికి కే‌సి‌ఆర్ సుముకత వ్యక్తం చేస్తూనే వచ్చారు.

Telugu Congress, Majlis, Telangana-Politics

ఇక తాజాగా మరో డిమాండ్ ను బి‌ఆర్‌ఎస్ ముందు ఉంచనుందట మజ్లిస్ పార్టీ.పాతబస్తీలో కచ్చితంగా తాము గెలిచే ఏడు స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను కూడా డిమాండ్ చేయాలని భావిస్తోందట.ఈ డిమాండ్ కు కే‌సి‌ఆర్ ససేమిరా అంటే పొత్తు క్యాన్సిల్ చేసుకొని స్వతంత్రంగా బరిలోకి దిగాలనే ఆలోచనలో మజ్లిస్ పార్టీ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం మజ్లిస్ పార్టీ ని దూరం చేసుకోవడం బి‌ఆర్‌ఎస్ కు ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే గతంతో పోల్చితే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బలంగా ఉన్నాయి.

అందుకే ఈ రెండు పార్టీలపై పైచేయి సాధించాలంటే ఏం ఐ ఏం దోస్తీ చాలా అవసరం.మరి ఏం ఐ ఏం డిమాండ్లకు బి‌ఆర్‌ఎస్ ఒకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube