హిందూ ధర్మంలో ప్రతి నెల రెండు ఏకాదశి లను జరుపుకుంటూ ఉంటారు.ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు.
అయితే ప్రస్తుతం పితృపక్ష సమయం నడుస్తుంది.పైగా బాద్రపద మాసం.
ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి( Indira Ekadashi ) అని అంటారు.పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వీకులకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా వారికి మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుంది.హిందూ క్యాలెండర్ ప్రకారం బాద్రపద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిధి అక్టోబర్ 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలై అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3.08 నిమిషముల వరకు కొనసాగుతుంది.

ఉదయం తిథి ప్రకారం అక్టోబర్ 10వ తేదీన ఏకాదశి ఉపవాసం ఉంటారు.ఇందిరా ఏకాదశి మరుసటి రోజు అక్టోబర్ 11వ తేదీన ఉదయం 6.19 నుంచి 8.38 నిమిషముల వరకు పారాయణ సమయం ఉంటుంది.ఈ రెండు గంటల్లోనే భక్తులు వ్రతం పూర్తి చేసుకోవాలి.
ఇందిరా ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన కార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పితృపక్షం( Pithru Paksham )లో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వికులకు సమర్పిస్తే నరకానికి వెళ్లిన పూర్వీకులకు స్వర్గ ప్రాప్తి పొందుతారని చెబుతున్నారు.
ఇందులో ఏకాదశి రోజు సూర్యాస్తమయంలో తులసి మొక్క( Basil plant ) సమక్షంలో నెయ్యితో దీపాలు వెలిగించాలి.

ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయడం ఎంతో మంచిది.దీని వల్ల మీ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి.
అలాగే ఇందిరా ఏకాదశి రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి.దీని వల్ల చనిపోయిన మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.
మన దరిద్రం కూడా దూరం అవుతుంది.అలాగే ఇంట్లో విష్ణు సహస్ర నామ పఠనం చేయాలి.
దాని భజన కీర్తన చేయాలి.ఈ కార్యక్రమం వల్ల ఇంట్లోనీ నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లిపోతుంది.
ఇంట్లో గొడవలు కూడా జరగవు.
TELUGU BHAKTHI







