అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీ లో ఎవరికివారు సొంతంగానే ప్రకటనలు చేసేస్తూ ఉంటారు.అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉందని చెబుతూ, సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు .
తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో ఈ వ్యవహారాలన్నీ సర్వసాధారణంగానే మారిపోయాయి .ప్రస్తుతం ఎన్నికల వ్యూహాల్లో కాంగ్రెస్ బిజీగా ఉంది .ఎక్కడికక్కడ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానున్న నేపథ్యం లో , ముందుగానే జనాల్లో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు .తాజాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి.కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు, ఏదో ఒక రోజు నేను కూడా సీఎం అవుతానని వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy )చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి .నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్( Vemula Veeresham ) లో చేరిన సందర్భంగా తొలిసారిగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నకిరేకల్ కు వచ్చారు.ఈ సందర్భంగా చిట్యాల మండలం పంతంగి టోల్ ప్లాజా నుంచి నకిరేకల్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు అని అన్నారు.
ఏదో ఒక రోజు తాను కూడా సీఎం అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కోమటిరెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకే సీఎం పదవి వస్తుందనే ఆశతో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్నారు.రాహుల్ ఆశీస్సులు ఉండడంతో పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతాననే అభిప్రాయంతో ఉండగా , కోమటిరెడ్డి వ్యతిరేక వర్గం గా పేరుపొందిన నేతలు ఎక్కడా తగ్గడం లేదు.తాము సీఎం రేసులో ఉన్నామని అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూ, తెలంగాణ కాంగ్రెస్ లో కాక రేపుతున్నారు.