ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టు కావడంతో ఎంతోమంది నిరసనలు తెలియజేస్తున్నారు.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్(NTR).
స్పందించకపోవడంతో ఆయన పట్ల తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై స్పందించకపోతే ఎన్టీఆర్ తన పేరు ముందు తన ఇంటిపేరు నందమూరి అని తొలగించుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ విధంగా చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.
ఇలా ఎన్టీఆర్ గురించి ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఏమాత్రం స్పందించలేదు అయితే ఎన్టీఆర్ ఇలా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అని కూడా పలువురు ఆలోచనలో పడ్డారు.
అయితే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు.కానీ ఆయన పట్ల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేతలు చాలా చులకన భావన చూపించారు.
అందుకే ఈసారి కూడా ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక నారా నందమూరి కుటుంబానికి సంబంధించి ఎలాంటి కార్యాలు జరిగిన ఎన్టీఆర్ కి ఆహ్వానం ఉండదు.దీంతో ఎన్టీఆర్ కూడా ఈ కుటుంబాల పట్ల పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేరని తెలుస్తోంది.గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఈయనకు ఆహ్వానం అందలేదని సమాచారం.
ఇలా ఎన్టీఆర్ ను ప్రతి విషయంలోనూ దూరం పెడుతూ ఉన్నటువంటి ఈ కుటుంబానికి ఆపద వస్తే ఎన్టీఆర్ కనిపించారా అంటూ పలువురు ఎన్టీఆర్ కు మద్దతు తెలియజేస్తున్నారు.
ఇకపోతే గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాలకృష్ణ(Balakrishna) కు ఎన్టీఆర్ రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎన్టీఆర్ టిడిపి పార్టీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేక మైనస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు బాలయ్య కొన్ని నిమిషాల పాటు మౌనం వహించారు.
అయితే బాలకృష్ణ ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే పార్టీకి మైనస్ అవుతుందని సమాధానం చెప్పారు.మరి బాలయ్య దృష్టిలో ఏ విధంగా పార్టీకి మైనస్ అవుతుందన్న విషయం తెలియక పోయినప్పటికీ ఎన్టీఆర్ రావడం వల్ల పార్టీకి నష్టమే అని బాలకృష్ణ చెప్పేయడం ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో కలిచి వేస్తుంది.
ఇలా ఎన్టీఆర్ టిడిపి పార్టీలోకి వస్తే పార్టీకి మైనస్ అవుతుందని చెప్పినటువంటి బాలకృష్ణ ఇప్పుడు ఆ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అవసరం ఎందుకు అని కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తూ ప్రశ్నిస్తున్నారు.అప్పుడు ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే మైనస్ అయినది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపి పార్టీలోకి వస్తే మైనస్ కాదా ప్లస్ అవుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తన అల్లుడు లోకేష్( Nara Lokesh ) కు ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదని టిడిపి పగ్గాలు పూర్తిగా ఎన్టీఆర్ చేతులలోకి వెళ్లిపోతాయన్న భావనతోనే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెట్టారనీ మరికొందరు కూడా భావిస్తున్నారు.ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా ఆయన గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడంతో కొందరు అభిమానులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.