చంద్రబాబుతో పవన్‎ ‘మిలాఖత్’..: పేర్ని నాని

ఏపీలో పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేసి దొరికారని తెలిపారు.

 Pawan `milakhat' With Chandrababu..: Perni Nani-TeluguStop.com

పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారా? లేక డీల్ కోసం వెళ్లారా ? అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబుతో పవన్ ది ములాఖత్ కాదన్న ఆయన మిలాఖత్ అని ఎద్దేవా చేశారు.

అదేవిధంగా ఇది సెంటిమెంట్ కాదని, సెటిల్ మెంట్ అని అర్థం అవుతుందని విమర్శించారు.పవన్ క్లారిటీతోనే ఉన్నారన్న పేర్ని నాని బీజేపీకే క్లారిటీ లేదని పేర్కొన్నారు.టీడీపీ – జనసేన పొత్తు హాస్యాస్పదం అన్నారు.అయితే టీడీపీ, జనసేన ఒక్కటే అని అందరికీ తెలిసిన విషయమేనని, పవన్ అనే వ్యక్తి టీడీపీలో అంతర్భాగం అని ప్రపంచానికి తెలుసని వెల్లడించారు.

చంద్రబాబు వాడుకుని వదిలేసే రకమని పవన్ గతంలో అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ క్రమంలో అటువంటి వారితో పొత్తు ఎందుకో జనసేనాని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube