అయ్యో పాపం... రవితేజ మంచి అవకాశాలు మిస్ చేసుకున్నాడా?

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరో గా రూపొందుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా దసరా కు విడుదల చేయాలని భావిస్తున్నారు.

 Raviteja Tiger Nageswara Rao Movie Release Date Details, Ravi Teja, Renu Desai,-TeluguStop.com

దసరాకు ఇతర సినిమా ల నుంచి పోటీ ఉన్న కారణంగా నాగేశ్వరరావు పరిస్థితి ఏంటో అన్నట్లుగా కొందరు కామెంట్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఆ మధ్య వరుసగా విడుదల అయిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

అంతే కాకుండా ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.అందుకే ఈ నెలలో మాస్ రాజా రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు వస్తే బాగుండేది అంటూ కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.

Telugu Raviteja, Ravi Teja, Ravitejatiger, Renu Desai, Telugu, Tigernageshwara,

రవితేజ అభిమానులు కూడా ఇప్పటికే నాగేశ్వరరావు ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.దసరా కి ( Dasara ) ముందు వరకు సినిమా ను విడుదల చేసే ఉద్దేశ్యం తో యూనిట్‌ సభ్యులు పని చేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి.ఒకటి రెండు వారాల్లో ప్యాచ్ వర్క్ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) కీలక పాత్ర లో కనిపించబోతుంది.రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ నటించడం వల్ల ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.

Telugu Raviteja, Ravi Teja, Ravitejatiger, Renu Desai, Telugu, Tigernageshwara,

ఇక ఈ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు అవ్వాల్సి ఉంది.అంతే కాకుండా రవితేజ గత చిత్రాల విషయం లో అభిమానులకు నిరాశ మిగిలింది.అందుకే ఈ సినిమా విషయం లో అంచనాలు భారీగా ఉన్నాయి.గత చిత్రాల విషయంలో రవితేజ చేసిన తప్పులు చేయకుండా ఈ సినిమా విషయం లో జాగ్రత్తగా ఉంటున్నాడు.

విడుదల విషయం లో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, ఇప్పటికే మంచి అవకాశాలు మిస్ చేసుకున్నాడు, ఇకపై అయినా రవితేజ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, మంచి రిలీజ్ డేట్‌ ను ఎంపిక చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube