జ్యోతిష్య శాస్త్రం ప్రకారం( Astrology ) మరణానికి ముందు మృత్యుదేవత మరణించే వ్యక్తికి అనేక సంకేతాలను ఇస్తుంది.గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంతకాలం ముందు మరణించే వ్యక్తి దీని గురించి తెలుసుకొని కొన్ని సంకేతాలను పొందడం మొదలు పెడతాడు.
పురాణాల ప్రకారం విష్ణు స్వయంగా గరుడ పురాణం( Garuda Puranam )లో ఈ సంకేతాల గురించి తెలిపాడు.కొందరు వ్యక్తులు కలలు లేదా దార్శనిక అనుభవాల ద్వారా యమరాజు యొక్క లక్షణాలను అనుభవిస్తారు.
కలలు మరియు ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా రాబోయే సంఘటనలను అంచనా వేయడానికి ఇది ఒక మార్గం.
అయితే మరణానికి ముందు యమరాజు( Yama Raju ) ఎలాంటి సంకేతాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒకరి చిత్రం నీటిలో, నూనెలో, అద్దంలో ఏర్పడకపోతే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనదని చాలామంది ప్రజలు నమ్ముతారు.మరణం( Death ) సమీపించినప్పుడు వ్యక్తి యొక్క దృష్టి పోతుంది.
అలాగే అతను తన చుట్టూ కూర్చున్న వ్యక్తులను కూడా చూడలేడు.ఎవరి పనులు మంచిగా ఉంటాయో వారి ముందు దైవిక కాంతి కనిపిస్తుంది.
అంతేకాకుండా మరణ సమయంలో కూడా ఆ వ్యక్తి భయపడడు.మరణ సమయం సమీపించినప్పుడు ఇద్దరూ యమదూతలు వచ్చి మరణిస్తున్న వ్యక్తి ముందు నిలబడతారని గరుడ పురాణంలో ఉంది.
ఎవరి కర్మలు మంచివి కావో వారికి తమ ముందు నిలబడిన యమదూతలు భయంకరమైన భయంకర రూపంలో కనిపిస్తారు.
అలాగే శరీరాన్ని విడిచి పెట్టే చివరి క్షణం( Death Signs )లో వ్యక్తి ఒక స్వరం కూడా పనిచేయదు.అతను మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ మాట్లాడలేడు.అలాగే ఇతరుల స్వరం కూడా గుర్తుపట్టలేడు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి పళ్ళు విరిగిపోవడం, చూపు బలహీనపడడం, శరీరం పని చేయకపోవడం వంటివి కూడా మరణానికి ముందు లక్షణాలు అని గరుడ పురాణంలో ఉంది.గరుడ పురాణం ప్రకారం పూర్వికులు మరణానికి కొన్ని రోజుల ముందు కలలో కనిపిస్తారు.
కలలో పూర్వీకులు ఏడుస్తూ లేదా విచారంగా కనిపిస్తే వారి మరణం సమీపంలో ఉందని అర్థం చేసుకోవచ్చు.