ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు, బైకులు చాలానే ఉన్నాయి.కోట్ల విలువ చేసే వాహనాలు అత్యంత ధనవంతుల గ్యారేజీలలో దర్శనం ఇస్తుంటాయి.
ఇదేమీ అంత పెద్ద విషయమై కాదు.అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారును కేవలం పది మంది మాత్రమే కొనుక్కోగలరు.
అంత ఖరీదైన కారుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్లు, ధర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును పినిన్ పరీనా( Pinin parina ) అనే కంపెనీ తయారు చేసింది.
ఈ కారు ఒక ఎలక్ట్రిక్ కారు.దీని ధర 4.4 మిలియన్ యూరోలు.మన భారత కరెన్సీలో 39.8 కోట్ల రూపాయలు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ రకం కారులను పినిన్ పరీనా కంపెనీ కేవలం 10 మాత్రమే తయారు చేసింది.
ఈ ఎలక్ట్రిక్ కారు పేరు “బి95 రోడ్ స్టర్ హైర్”( B95 Roadster Hire ).ఈ కారు కు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్లు ఏమిటో చూద్దాం.
ఈ ఎలక్ట్రిక్ కారు ను ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే, ఏకంగా 450 కిలోమీటర్ల దూరం రోడ్లపై పరుగులు తీస్తుంది.ఈ కారుకు 270 కిలో వాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ తో ఛార్జ్ చేయాలి.కేవలం 25 నిమిషాలలో 20 నుంచి 80% వరకు చార్జ్ అవుతుంది.బి95 రోడ్ స్టర్ హైర్ కేవలం రెండు సెకండ్లలో గంటకు 0 నుండి 96 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.ఈ కారు గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రోడ్లపై పరుగులు తీస్తుంది.
ఇందులో మోటర్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది.ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ప్యూరియోసా అండ్ కరాటెరా అనే 5 డ్రైవింగ్ మోడ్లు పెట్టారు.ఈ కారులో ప్రయాణిస్తే ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని కంపెనీ తెలిపింది.