పోలీసుల పై నోరు జారిన రేవంత్ !

తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడు తో ముందుకు వెళ్తున్నతెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మరో సారి పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు .నాగర్ కర్నూల్ లో అధికార బారాసా( BRS ) నుంచి కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కొంతమంది పోలీసు అధికారులు ఉదేశపూర్వకంగా అధికార పక్షానికి తొత్తులుగా మారిపోయారని వారి అండ చూసుకొని ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని అటువంటి పోలీసు అధికారుల పేర్లు అన్నిటినీ తాము ఒక రెడ్ బుక్ లో పొందుపరుస్తున్నామని,

 Revanth Reddy Shocking Comments On The Police Details, Revanth Reddy, Revanth Re-TeluguStop.com
Telugu Congress, Nagar Kurnool, Revanth Reddy, Telangana, Ts-Telugu Political Ne

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) అదికారం లోకి రాగానే అలాంటి పోలీసు అధికారులు( Police Officers ) అందరిని గుడ్డలుడతీసి తంతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై స్పందించిన పోలీసు అధికారుల సంఘం తమ మనోభావాలు దెబ్బతీసేలా, పోలీసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లు ఇచ్చారు, దాంతో ఆయనపై ఐపిసి 506, 504,153 సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది.ఇటీవల కాలంలో పోలీసులపై పొలిటికల్ దాడులు పెరిగిపోయాయి.తమకు అనుకూలంగా పనిచేయడం లేదని తమ సభలకు పర్మిషన్లు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో పోలీసు అధికారులకు వార్నింగ్ ఇస్తూ బెదిరించే కల్చర్ పెరిగిపోతుంది.

Telugu Congress, Nagar Kurnool, Revanth Reddy, Telangana, Ts-Telugu Political Ne

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలు కాపాడుతూ విధి నిర్వహణలో తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి పనిచేస్తున్న తమపై ఇటువంటి పొలిటికల్ దాడులు, ఇలాంటి వ్యాఖ్యలు తగదంటూ పోలీసులు సంఘం హెచ్చరిస్తుంది.అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగం ( Constitution ) ప్రకారమే తాము వ్యవహరిస్తామని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులు పనిచేయడం లేదని తమ విధులకు అడ్డొస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామంటూ పోలీసు అధికారుల సంఘం హెచ్చరించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube