మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాల్సిందేనని చెబుతూ వుంటారు ఆరోగ్య నిపుణులు.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అది ఎంతమందికి సాధ్యపడుతుందంటే చెప్పలేము కానీ, ప్రతిరోజూ వాకింగ్( Walking ) చేయడం వలన అనేకరాలుగా మేలు చేకూరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
అవును, రోజుకు ఓ గంటసేపు వాకింగ్ అనేది జీవితంలో మీరు చేయగలిగే బెస్ట్ ఎక్సర్‌సైజ్ అవుతుంది.ఎందుకంటే, అందరూ అన్ని రకాల జిమ్ వర్కవుట్స్( Gym workouts ) చేయలేరు.
అలాంటివారికి వాకింగ్ అనేది సరైన ప్రత్యామ్నాయం.రోజుకు కనీసం అరగంట నడిచినా 150-200 కేలరీలు బర్న్ అవుతాయంటే అతిశయోక్తి కానే కాదు.

రోజూ వాకింగ్ చేయడం వల్ల మీ వెస్టిబ్యులర్ సిస్టమ్ స్టిమ్యులేట్( Vestibular System Stimulate ) అవుతుంది.తద్వారా బాడీ బ్యాలెన్స్ చాలాబాగా మెరుగు పడుతుంది.వివిధ పరిశోధనల ప్రకారం మనిషి సరాసరి జీవిత కాలం 78 ఏళ్లు అయితే, రోజూ వాకింగ్ చేయడం ద్వారా 90 ఏళ్ల వరకూ బతకగలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు.అందుకే రోజూ కనీసం అరగంట లేదా గంట వ్యాయామం చేయడం మన శరీరానికి చాలా అవసరం.
వాకింగ్ వలన శరీర సామర్ధ్యం పెరిగి శరీరం వివిద రకాల ఇన్‌ఫెక్షన్లు , క్రిములను ఎదుర్కొనే శక్తిని పొందుతుంది.ఎందుకంటే వాకింగ్ వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాలు( White Blood Cells ), లింఫోసైట్స్ స్టిమ్యులేట్ అయి ఇమ్యూనిటీ పెరుగుతుంది.

అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.ముఖ్యంగా డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు సమస్యలను దూరం పెట్టవచ్చు.రోజూ వాకింగ్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ బాడీ పోశ్చర్ మారుతుంది.అంటే స్టిఫ్‌గా నిటారుగా ఉండేట్టు చేస్తుంది.వాకింగ్ చేయడం వల్ల నాడి కణాలు ఒకదానికొకటి బాగా కనెక్ట్ అవుతుంటాయి.బాడీలో బ్లడ్ సర్క్యులేషన్( Blood Circulation ) మెరుగుపడుతుంది.
రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటాయని పలు అద్యయనాల్లో వెల్లడైంది.అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులకు డాక్టర్లు కూడా రోజూ వాకింగ్ చేయమనే సూచిస్తుంటారు.







