ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకోసమే..!

ముఖ్యంగా చెప్పాలంటే గుర్రాలు ( Horses )పరిగెత్తుతూ ఉన్నట్లు ఉంటే అది వ్యాపార అభివృద్ధికి చిహ్నమని పండితులు చెబుతున్నారు.దీన్ని ఇంట్లో పెట్టుకోవడం ఆధ్యాత్మికతకు గుర్తు మాత్రమే కాదు.

 Do You Want To Keep A Picture Of Seven Horses At Home But This Is For You , Seve-TeluguStop.com

అంతే కాకుండా ప్రేమ, ఆనందం, సంతోషం, ధైర్యం, సహనం వంటి అనేక లక్షణాలను సూచిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అయితే ఈ గుర్రాలు ఏ దిశలో పరుగెడుతున్నాయనేది కూడా ఇంట్లోనీ పరిస్థితి పై ప్రభావాన్ని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కెరీర్లో పురోగతి సాధించాలంటే తూర్పు దిశలో పరిగెడుతున్న ఏడు గుర్రాలు చిత్రపటం( Seven horses picture ) మంచిదని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా పనిలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే ఆ పనులు ముందుకు కదిలే అవకాశం ఉందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం పరిగెడుతున్న ఏడు గుర్రాల పెయింటింగ్ దక్షిణ దిశలో పెట్టుకోవడం వల్ల చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది.ఈ దిశలో ఏడు గుర్రాల పోస్టర్ ఉండడం శుభప్రదం అనీ పండితులు చెబుతున్నారు.

అలాగే ఉత్తర దిశలో పరిగెడుతున్న ఏడు గుర్రాల పోస్టుర్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో సిరీ సంపదలకు లోటు ఉండదు.

ముఖ్యంగా చెప్పాలంటే రాగి,ఇత్తడి, వెండితో ( copper, brass, silver )చేసిన పరిగెత్తే గుర్రం విగ్రహాన్ని షాప్స్ లో పెట్టుకోవడం వల్ల లాభాలను పొందుతారు.గుర్రాలు పరిగెత్తడం వేగానికి చిహ్నం కాబట్టి ఇలా పరిగెత్తే ఏడు గుర్రాల విగ్రహం లేదా పోస్టర్ ను ఇంట్లోని బెడ్ రూమ్ లో పెట్టుకోవద్దు.అదే సమయంలో మెయిన్ హాల్లో, స్టేడియం లో, ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవచ్చు.

అయితే ఎప్పుడూ ఒక గుర్రం అది నడుస్తున్న ఫోటోను పెట్టుకోకూడదు.అంతేకాకుండా గుర్రం ముఖం ఇంటి లోపలికి చూస్తున్నట్లు ఉండాలి.

Running Horses Painting Vastu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube