Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ కు అలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేశ్… బావా అని పిలుస్తూ?

నేడు పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.అంతేకాకుండా ఎన్టీఆర్ సంబంధించిన ఫోటోలు వీడియోలను ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

 Nara Lokesh Wishes Jr Ntr On His Birthday-TeluguStop.com

అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ కావడంతో పండగ వాతావరణం నెలకొంది.అభిమానులు వారం రోజుల ముందు నుంచి ఎన్టీఆర్ బర్త్డేకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్టీఆర్( Jr ntr ) కి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ ( Nara lokesh )జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ లోకేశ్ కు మేనమామ కుమారుడు అన్న సంగతి తెలిసిందే.దీంతో లోకేశ్ కు ఎన్టీఆర్ బావ అవుతాడు.దీంతో బావ ఎన్టీఆర్ కు లోకేశ్ ప్రతీ సంవత్సరం వలె ఈఏడాది కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.@tarak9999 మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.మీ రాబోయే సినిమాలు మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు./br>

దేవుడు మీకు మంచి ఆరోగ్యం సమృద్ధిని దీవిస్తాడు అని రాసుకొచ్చారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే.

గత ఏడాది ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube