డీ సీక్వెల్ తో మరో ప్రయత్నం చేస్తున్న దర్శకుడు!

మంచు ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఎప్పుడో కాని హిట్స్ రావు.వారు ఎన్ని సినిమాలు చేసిన వేళ్ళ లెక్క పెట్టె సింగిల్ డిజిట్ లోనే వారికి హిట్స్ వున్నాయి.

 Manchu Vishnu Sreenu Vaitla To Team Up For The Sequel-TeluguStop.com

సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు తీసిన ఎందుకనో వారికి అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి.ఈ కారణంగానే మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర తర్వాత సినిమాలకి కొంత విరామం ఇచ్చి తన బిజినెస్ ని విస్తరించుకునే పనిలో పడ్డాడు.

అలాగే మంచు మనోజ్ కూడా ఇతర వ్యాపకాలలో బిజీ అయ్యి తన నెక్స్ట్ సినిమాని మార్చిలో ప్రకటిస్తా అని చెప్పాడు.ఇదిలా వుంటే మంచు విష్ణు ఇప్పుడు మరో సినిమాకి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మంచు విష్ణు కెరియర్ లో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల.అయితే ఇప్పుడు ఈ దర్శకుడు వరుస డిజాస్టర్స్ తో ఫ్లాప్ దర్శకుల లిస్టు లో చేరిపోయాడు.

మొన్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత స్టార్ హీరోలు ఎవరు కూడా శ్రీనువైట్ల వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయాడలేదు.దీంతో ఇప్పటికి జ్ఞానోదయం అయిన శ్రీనువైట్ల మళ్ళీ ఎలా అయిన తనని తాను నిరూపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు.

అందులో భాగంగా తన కెరియర్ లో సూపర్ హిట్ సినిమా అయిన డీ సీక్వెల్ సిద్ధం చేసి మంచు విష్ణుని చివరికి ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక మంచు విష్ణు ఈ సినిమాని తన ప్రొడక్షన్ లో నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక డీ సీక్వెల్ తో హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని శ్రీనువైట్ల కల ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube