ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dil Raju )ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.శాకుంతలం( Shaakuntalam ) సినిమా తో తనకు రూ.40 కోట్లు నష్టం వచ్చింది అంటూ ప్రకటించిన దిల్ రాజు తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అత్యధిక నష్టం అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.శాకుంతలం సినిమా యొక్క బడ్జెట్ విషయంలో దిల్ రాజు చెప్పిన మాట గుణశేఖర్( Gunasekhar ) వినలేదు అనేది టాక్.
అందుకే ఇతర సినిమాల్లో తల దూర్చవద్దని.

సమర్పణ వంటివి కూడా ఏమీ చేయవద్దనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్లుగా తెలుస్తోంది.అందుకే దిల్ రాజును ఎంతగా అడిగినా కూడా ఆదిపురుష్ ను కొనుగోలు చేసేందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది.ఆదిపురుష్ కొనుగోలు చేయక పోవడం మంచిది అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ మధ్య నెలకు కనీసం ఒకటి రెండు సినిమా లతో అయినా దిల్ రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు.డిస్ట్రిబ్యూటర్ గా లేదా సమర్పకుడిగా దిల్ రాజు వచ్చే వాడు.

కానీ ఇప్పటి వరకు కూడా ఇతర సినిమా లను ఈయన కమిట్ అయినట్లుగా కనిపించడం లేదు.అలాగే దిల్ రాజు సినిమా లు కూడా చాలా స్లో గా సాగుతున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సోషల్ మీడియా లో దిల్ రాజు విషయాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.దిల్ రాజు కనుక ముందు ముందు ఇలాగే ఉంటే చిన్న నిర్మాతలకు గడ్డు పరిస్థితిలు అంటున్నారు.
చిరంజీవి సినిమా భోళా శంకర్ ను దిల్ రాజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి గా ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆ విషయం లో దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
మొత్తానికి దిల్ రాజు గతంలో మాదిరిగా యాక్టివ్ గా లేడు అని చర్చ జరుగుతోంది.







