టెక్నో పొవా 6ప్రో 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర తక్కువ-ఫీచర్లు ఎక్కువ..!

టెక్నో పొవా 6ప్రో 5G( Tecno Pova 6 Pro 5G ) స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయింది.మధ్య తరగతి బడ్జెట్ లో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.

 Tecno Pova 6pro 5g Launched Check Specifications Price Details-TeluguStop.com

టెక్నో పొవా 6ప్రో 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.78 అంగుళాల Full HD+AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది.

108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా( Triple Rear Camera ) సెటప్ తో ఉంటుంది.2ఎంపీ,0.08 ఎంపీ డెప్త్ సెన్సర్ లతో వస్తుంది.ప్రైమరీ సెన్సర్ 3ఎక్స్ జూమ్ ను సపోర్ట్ చేస్తుంది.సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఇక ఈ ఫోన్ కు ముందు వెనుక డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ లు ఉన్నాయి.మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC ఆక్టా కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 14( Android 14 ) OS వెర్షన్ పై రన్ అవుతుంది.

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 70వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కు మద్దతు ఇస్తుంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో వైఫై 5.0, బ్లూటూత్ 5.3, NFC,GPS,USB టైప్-C కనెక్టివిటీ,IP స్ప్లాఫ్ ప్రూఫ్, డ్యూయల్ నానో సిమ్, డాల్బీ అట్మాస్ స్పీకర్స్, 3.5 mm ఆడియో జాక్ లాంటి ఫీచర్లతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే కలర్ ఆప్షన్ లలో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube