ఇటీవల చిన్నపిల్లల కూడా స్మార్ట్‌ఫోన్లు( Children Smartphones ) వాడుతున్నారు.స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, ఛాటింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు.
చిన్న వయస్సులోనే ఫోన్‌కు బానిసలుగా మారి అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.చిన్నపిల్లలు ఏడుస్తున్నారని లేదా గొడవ చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా ఫోన్లు ఇస్తున్నారు.
వారికి కూడా కొత్త ఫోన్లు కొని పెడుతున్నారు.దీంతో పిల్లలు ఫోన్లకు మరింత బానిసవుతున్నారు.24 గంటలు ఫోన్ లోనే గడుపుతూ తమ సమయం వృథా చేసుకుంటున్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనగా.చైనా( China )లో కూడా పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు.దీనిపై చైనాలోని జిన్ పింగ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
దీంతో అక్కడి ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్( Online Games ) కు సంబంధించి పలు నిబంధనలు తెచ్చింది.పిల్లలు పగటిపూట 90 నిమిషాలు మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ ఆడుకునేలా 2019లో ఆంక్షలు తెచ్చింది.
ఇక శుక్ర, శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో గంట సమయానికే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలు తెచ్చింది.అయితే తాజాగా మరోసారి చిన్నారుల స్మార్ట్‌ఫోన్ వాడకంపై మరికొన్ని నిబంధనలను తెచ్చింది.
మైనర్ పిల్లలు( Minor Kids ) స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని రోజుకు రెండు గంటలు మాత్రమే పరిమితం చేసింది.దీనికి సంబంధించిన ముసాయిదాను బుధవారం సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా విడుదల చేసింది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ లో మైనర్లకు చాలా సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.16 నుంచి 18 ఏళ్ల వయస్సువారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ వాడాలి.ఇక 8 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు గంటసేపు మాత్రమే ఇంటర్నెట్ వాడాల్సి ఉంటుంది.ఇక 8 లోపు వయస్సువారికి ఇంటర్నెట్ వాడుకోవడానికి అనుమతి లేదు.