ఒక్కపుడు అక్కినేని నాగేశ్వర రావు ఇండస్ట్రీ లో చాలా పెద్ద హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఎన్టీయార్ ( NTR )అన్ని మైథలాజికల్ సినిమాలు తీస్తుంటే, ఈయన మాత్రం సాంఘిక సినిమాలు తీస్తూ ఉండేవారు…ఇక వీళ్లిద్దరూ అప్పట్లో ఇండస్ట్రీ కి రెండు కండ్లు గా చెప్పుకునే వారు.
ఇక అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండవ తరం హీరోగా నాగార్జున వచ్చి యువ సామ్రాట్ నాగార్జున గా ఇండస్ట్రీ లో టాప్ హీరో గా ఎదిగి అక్కినేని నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాడు.అయితే మూడవ తరం అక్కినేని హీరోలు గా వచ్చిన సుమంత్, సుశాంత్ లు హీరోలు గా పెద్ద గా సక్సెస్ కాలేదు…అయిన కూడా సుమంత్ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తుంటే సుశాంత్ మాత్రం సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువ గా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమా( Ala Vaikuntapuram Lo ) లో సుశాంత్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు.దానికి పెద్ద గా గుర్తింపు రాకపోయినప్పటికి సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది…ఇక ఇప్పుడు చిరంజీవి హీరో గా తమిళ్ సినిమా అయిన వేదలం సినిమాకి రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా సుశాంత్ ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు…ఇక ఈ సినిమా కి మెహర్ రమేష్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు…ఇందులో ఉన్న ఆ ఇంపార్టెంట్ రోల్ కి సుశాంత్ అయితేనే బాగుంటాడు అని అనుకున్న మెహర్ రమేష్ ఆయన్ని తీసుకున్నారు…ఇక ఈ క్యారెక్టర్ తో ఒక మంచి గుర్తింపు అయితే వస్తుంది అని సుశాంత్ అభిప్రాయపడుతున్నాడు.
ఇక సుశాంత్ పరిస్థితి చూసిన అక్కినేని అభిమానులు మాత్రం సుశాంత్( Sushanth ) హీరోగా చేయడం మానేసి ఇక వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు చేస్తున్నాడు.ఇతను కూడ సుమంత్ మాదిరి హీరోగా సినిమాలు చేయవచ్చు కదా అని అందరూ అంటున్నారు…అయితే సుశాంత్ మంచి కథ దొరికితే అటు హీరోగా చేస్తూనే ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు.ఇలా చేయడం వల్ల జనాల్లో ఎప్పుడు కనిపిస్తూ ఉండచ్చు దానివల్ల ఆయన పేరు కూడా ఎక్కువగా సిని అభిమానుల్లో వినిపిస్తుంది అందుకే ఆయన అలా చేస్తున్నాడు ఇది తెలిసిన కొంత మంది సుశాంత్ పెద్ద ప్లాన్ వేశాడు అంటూ చెప్పుకుంటున్నారు…
.