మేకప్ ఎందుకు దండగ.. రోజు నైట్ ఈ క్రీమ్ రాసుకుంటే ఉదయానికి మీ ముఖం మెరిసిపోతుంది!

ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ మేకప్( Makeup ) ఉత్పత్తులకు బాగా అలవాటు పడిపోయారు.బయటకు వెళ్లాలంటే ముఖానికి మేకప్ మెరుగులు పెట్టాల్సిందే.

 Homemade Face Cream For Natural Glowing Skin Details! Natural Glowing Skin, Skin-TeluguStop.com

నిత్యం జాబ్ కు వెళ్లే వారి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు.రోజు వెళ్లే ఆఫీసే అయినా తాము అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని మేకప్ వేసుకుని వెళ్తుంటారు.

కానీ నిత్యం మేకప్ ఉత్పత్తులను వాడటం వల్ల చర్మ ఆరోగ్యం తీవ్రంగా పాడుతుంది.అందుకే సహజంగానే అందంగా మెరిసేందుకు ప్రయత్నించాలి.

ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ క్రీమ్ ను రాసుకుంటే ఉదయానికి మీ ముఖం సూపర్ గ్లోయింగ్ గా ( Glowing Face ) షైనీ గా మెరుస్తుంది.

ఈ క్రీమ్ ను వాడటం స్టార్ట్ చేశారంటే మేకప్ ఎందుకు దండగ అని మీరే అంటారు.మరి లేటెందుకు ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Tips, Biryani, Cinnamon, Face Cream, Homemade Cream, Latest, Natural Skin

వాటర్ హీట్ అవ్వగానే ఐదారు బిర్యానీ ఆకులను( Biryani Leaves ) తుంచి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon ) వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని దగ్గర పడేంత వరకు మళ్లీ స్టవ్ పై పెట్టి ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఆయిల్, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Biryani, Cinnamon, Face Cream, Homemade Cream, Latest, Natural Skin

తద్వారా మన క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.

ఈ క్రీమ్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే పోగొడుతుంది.

ముడతలను మాయం చేస్తుంది.చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

ఎలాంటి మేకప్ వేసుకోకపోయినా సహజంగానే అందంగా మెరిసిపోవాలని భావించే వారికి ఈ క్రీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube