ముఖ్యంగా చెప్పాలంటే శివాలయంలో శివుడి ఎదురుగా నంది విగ్రహం ఉన్నట్లే ఆంజనేయ స్వామి( Anjaneya Swami ) ఎదురుగా ఒంటె ను వాహనంగా దేవాలయాలలో ఉంచుతారు.కొన్ని దేవాలయాలు మాత్రం ఇలా కనిపిస్తూ ఉంటుంది.
శివ విష్ణువు మధ్య ఒకసారి వాదులాట జరిగి ఒక పందెం వేసుకోవాడం వల్ల శివుడు విష్ణుమూర్తి( Shivadu , Vishnumurthy ) కి సేవ చేయాల్సి వచ్చింది.అలా శివుడు విష్ణు సేవ కోసం హనుమంతుడిగా అవతారం ఎత్తాడు.
ఈ సందర్భంలో తనను విడిచి వెళుతున్న శివుడిని పార్వతి ఒక ప్రశ్న వేస్తుంది.
అర్థనారీశ్వరి ఆయన తనను ఇలా అవతారాలను ఎత్తేటప్పుడు కూడా వెంట ఉండాలనుకుంటున్నా అని కోరింది.అప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు.హనుమంతుడి బలమంతా తోకలో ఉంటుంది.
ఆ తోక పార్వతీ స్వరూపం.అందుకే స్వామికి పూజ చేసేటప్పుడు తోకకి పూలు పెడతారు.
తోకకు బొట్టు పెట్టడం కూడా పార్వతీ మాతకి పెట్టినట్లుగా భావిస్తారు.పార్వతి పరమేశ్వరుల సంభాషణ విని నందీశ్వరుడు( Nandiswaradu ) తనను కూడా ఇతర అవతారాల్లో వాహనంగా మలుచుకోమని కోరగా శివుడు వరం ఇస్తాడు.
ఆంజనేయుడు వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు.
మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి( Valmiki maharshi ) ఎక్కడ ప్రస్తావించినా ఆధారాలు లేవు.ఆంజనేయుడు తొలిసారిగా శ్రీరాముడ్ని పంపానది తీరంలోనే కలిశాడు.అందుకే ఈ ప్రాంతం అంటే హనుమంతునికి ఎంతో ఇష్టం.
ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించే దట్టమైన ఇసుక మేటలు ఉండేవి.హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను( camel ) సుగ్రీవుడు వాయు పుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని పండితులు చెబుతున్నారు.
అలాగే ఆంజనేయ స్వామి పంపా తీరా ప్రాంతంలోనే రామసేతు వారధి దగ్గర రోజు ప్రదక్షిణాలు చేస్తుంటారట.ఈ రెండు ఇసుక తీరంలో ఉండే ప్రాంతాలు కాబట్టి ఇలాంటి చోట్ల అనుకూలమైన వాహనం ఒంటె అందుకే నందీశ్వరుడు ఒంటె గా మారాడు.
DEVOTIONAL