సాధారణంగా కొందరి జుట్టు( Dry hair )తరచూ ఎండు గడ్డిలా డ్రైగా మారిపోతుంటుంది.వాతావరణంలో వచ్చే మార్పులు, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల జుట్టు డ్రై అయిపోతుంటుంది.
ఈ డ్రై హెయిర్ సమస్యను నివారించుకునేందుకు చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తుంటారు.కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి హెయిర్ స్పా ట్రీట్మెంట్ ను చేయించుకుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే డ్రై హెయిర్ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడిని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక అలోవెరా ఆకు( Aloe vera leaf ) తీసుకుని శుభ్రంగా వాటర్ తో కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో అలోవెరా జెల్ మరియు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతి పొడి మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.చివరిగా ఇందులో ఒక ఎగ్ వైట్ ను వేసి బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.గంట లేదా గంటన్నర పాటు షవర్ క్యాప్ ధరించి అనంతరం మైల్డ్ షాంపూ తో శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే డ్రై హెయిర్ అన్న మాటే అనరు.మీ జుట్టు న్యాచురల్ గానే షైనీగా సిల్కీగా మెరుస్తూ కనిపిస్తుంది.కాబట్టి డ్రై హెయిర్ సమస్యతో తరచూ ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీలో వాడిన గుడ్డు వల్ల జుట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందుతుంది.
దాంతో కుదుళ్లు బలంగా మారతాయి.ఫలితంగా జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
మరియు చుండ్రు సమ( Dandruff )స్య ఉన్న సరే ఈ రెమెడీ ద్వారా సులభంగా బయటపడొచ్చు.