తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) ముఖ్యమైన పండుగలలో బోనాలు( Bonalu ) ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఆషాడమాసంలో జరుపుకునే ఈ బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
బోనాల పండుగ వచ్చిందంటే చాలు గ్రామాల్లో, పట్టణాలలో ఎంతో కోలాహలంగా ఉంటుంది.చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఇంత ఇష్టంగా జరుపుకునే బోనాల పండుగ( Bonalu Festival ) విశిష్టత, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గ్రామదేవతలకు బోనం సమర్పించే ఆచారం ఈనాటిది కాదు.
ఈ బోనాల పండుగ పల్లవ రాజుల కాలానికి ముందు కాలం నుంచే ఉండేదని చరిత్ర చెబుతోంది.అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఏడుకోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినట్లు చరిత్రలో ఉంది.
ఇంకా చెప్పాలంటే 1869వ సంవత్సరంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించి చాలామంది చనిపోతూ ఉంటే అక్కడివారు గ్రామదేవతలకు పూజలు జరిపించి బోనం ఎత్తారు.దీనివల్ల అది తగ్గిపోయినట్లు చరిత్రలో ఉంది.అప్పటినుంచి హైదరాబాదులో బోనాల పండుగ కొనసాగుతుంది.అలాగే నిజాం ప్రభువుల కాలంలో కూడా ఈ పండుగ ఘనంగా జరిగేదని చరిత్ర చెబుతోంది.నిజాం ప్రభువులు ముస్లిం మతానికి చెందినవారైనా బోనాల పండుగను జరిపేందుకు పూర్తిగా సహకరించేవారు.దానికి నిదర్శనమే గోల్కొండలోని జగదాంబ అమ్మవారి ఆలయం అని చెబుతున్నారు.
బోనం అంటే భోజనం అని అర్థం వస్తుంది.బోనాల పండుగలో గ్రామ దేవతలకు కొత్త కుండలో భోజనం వండుతారు.అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం పోస్తారు.మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయతో చేసిన అన్నం, పెరుగు, పాలు, బెల్లం ను మట్టి కుండలలో పెట్టి వాటిని అలంకరిస్తారు.
ఆ తర్వాత ఆ కుండపై దివ్వె పెట్టి ఆడపడుచులు నెత్తిపై బోనం ఎత్తుకొని ఒక చేతిలో వేపాకు పట్టుకుని డప్పు చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తూ వెళ్లి గ్రామదేవతలైన పోలేరమ్మ, మారెమ్మ, డొంకలమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మగా పిలిచే గ్రామ దేవతలకు బోనంని,సాకని సమర్పిస్తారు.
DEVOTIONAL