2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఏపీని విభజించడం తెలిసిందే.అటు కేంద్రంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన జరిగింది.
ఈ క్రమంలో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా( AP Special Status ) హామీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తర్వాత 2014 ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం తెలిసిందే.
ఈ క్రమంలో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా హామీని తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సైతం ఇవ్వలేదు.ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు( Gidugu Rudraraju ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు.దేశంలో మరియు రాష్ట్రంలో సంక్షేమ పాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదని అన్నారు.చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిపిస్తానని హామీ ఇచ్చారు… దానికి అతీగతీ లేదని విమర్శించారు.
ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని చెప్పారు.కానీ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు.