ఫోన్‌ను ధర్మామీటర్‌గా మార్చేసిన ఎన్నారై.. అదెలాగంటే..

అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్లను థర్మామీటర్లుగా( Smartphone Thermometer ) మార్చే ఫీవర్‌ఫోన్( FeverPhone App ) అనే యాప్‌ను తాజాగా ఒక ఎన్నారై( NRI ) అభివృద్ధి చేసి ఆశ్చర్యపరుస్తున్నారు.భారతీయ సంతతికి చెందిన ఈ ప్రొఫెసర్‌తో సహా కొందరు శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

 Indian-origin Professor Turns Smartphone Into Thermometer Details, Feverphone Ap-TeluguStop.com

ఈ యాప్ ఫోన్ టచ్‌స్క్రీన్‌ ఆధారంగా పనిచేస్తుంది.వ్యక్తుల ప్రధాన శరీర ఉష్ణోగ్రతలను( Body Temperature ) అంచనా వేయడానికి ఇప్పటికే ఉన్న బ్యాటరీ ఉష్ణోగ్రత సెన్సార్లను పునర్నిర్మిస్తుంది.

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందం ఈ వినూత్న పరిష్కారాన్ని రూపొందించింది.భారతీయ సంతతికి చెందిన శ్వేతక్ పటేల్( Shwetak Patel ) సీనియర్ రచయితలలో ఒకరిగా ఉన్నారు.

37 మంది రోగులపై నిర్వహించిన పరీక్షలో ఫీవర్‌ఫోన్ యాప్ కొన్ని వినియోగదారు థర్మామీటర్లతో సరి సమానంగా శరీర ఉష్ణోగ్రతలను కచ్చితంగా అంచనా వేసింది.వ్యక్తులకు జ్వరాలు ఉన్నాయో లేదో గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటికే ఉన్న సెన్సార్లు, స్క్రీన్‌లను ఉపయోగించిన మొదటి యాప్ ఇది.శరీర ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవడంతో పాటు జ్వరం వచ్చిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఈ యాప్ సహాయపడుతుంది.

Telugu Temperature, Phone Sensors, Feverphone App, Machine, Nri, Shwetak Patel,

పరిశోధకులు ఈ యాప్ అభివృద్ధి చేయడానికి వివిధ పరీక్ష కేసుల నుంచి డేటాను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ మోడల్‌కు ట్రైనింగ్ ఇచ్చారు.యాప్ ఎంత త్వరగా ఫోన్ వేడెక్కుతుందో ట్రాక్ చేస్తుంది.టచ్‌స్క్రీన్ డేటాను ఉపయోగించి ఒక వ్యక్తి దానిని తాకడం ద్వారా ఎంత వేడి నమోదయిందో గుర్తిస్తుంది.కాలిబ్రేషన్, టెస్టింగ్ ద్వారా, యాప్ సగటున దాదాపు 0.23 డిగ్రీల సెల్సియస్ తేడాతో రోగి కోర్ బాడీ ఉష్ణోగ్రతలను అంచనా వేసింది, ఇది వైద్యపరంగా ఆమోదయోగ్యమైన పరిధిలోకి వస్తుంది.

Telugu Temperature, Phone Sensors, Feverphone App, Machine, Nri, Shwetak Patel,

అధ్యయనంలో పాల్గొన్న వారు ఫీవర్‌ఫోన్ యాప్‌ ఉష్ణోగ్రతలు రీడ్ చేయడానికి వీలుగా టచ్‌స్క్రీన్‌ను తమ నుదిటిపై సుమారు 90 సెకన్ల పాటు నొక్కి ఉంచారు.పరిశోధకులు ఈ వ్యవధిని కచ్చితమైన కొలతలకు సరైన సమయంగా ఎంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube