ఆ ఇద్దరి పై బీజేపీకి డౌట్ పట్టుకుందా.. ?

కర్నాటక( Karnataka ) ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ కొంత స్లో అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతే సౌత్ లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

 Does The Bjp Have Doubts About Those Two, Bjp , Ts Politics , Bandi Sanjay Kumar-TeluguStop.com

అందుకే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవలనే పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్గత విషయాలు కొంత కలవర పెడుతున్నాయి.

ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి వాళ్ళు పార్టీలో కొనసాగుతారా ? లేదా పార్టీకి గుడ్ బై చెబుతారా ? అనే అనుమానాలు అధిష్టానంలో కూడా ఉన్నట్లే కనిపిస్తోంది.అయితే బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఈటెల, కోమటిరెడ్డి, వివేక్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసినప్పటికీ.

అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.

Telugu Etela Rajender, Komatiraj, Komativenkat, Ts-Politics

దీనికి కారణం పార్టీ కార్యకలాపాలకు వీరు దూరంగా ఉండడమే.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ” ఇంటినికి బీజేపీ ” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్దిని, పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లె ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.

అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ” ఇంటింటికి బీజేపీ ” కార్యక్రమానికి ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy) దూరంగా ఉన్నారు.దీంతో మరోసారి వీరి పార్టీ మార్పు పై చర్చ జరుగుతోంది.

దీన్ని బట్టి చూస్తే పైపైకి పార్టీ మారేది లేదని ఈ నేతలు చెబుతున్నప్పటికి.లోలోపల పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో వీరి వైఖరిని గమనించిన బీజేపీ అధిస్థానం ఈటెల, కోమటిరెడ్డి లకు మరోసారి పిలుపందించింది.

Telugu Etela Rajender, Komatiraj, Komativenkat, Ts-Politics

ఇప్పటికే ఈటెల తో పలు మార్లు బేటీ అయిన బీజేపీ అధిష్టానం.ఆయన పార్టీ విదకుండా గట్టిగానే ప్రయత్నిస్తోందట.అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చుకునేందుకు ఆయన బ్రదర్ వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy)గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట.

అందుకే ఈ ఇద్దరు నేతలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీలో సరైన ప్రదాన్యం దక్కడం లేదని ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు అంటిఅంటనట్టుగా ఉంటూ వస్తున్నారు.

దీంతో వీరు ఏ క్షణంలోనైనా పార్టీ మారిన ఆశ్చర్యం లేదు.అందుకే ఇద్దరి నేతల విషయంలో బీజేపీ కొంత డౌట్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube