ఆ ఇద్దరి పై బీజేపీకి డౌట్ పట్టుకుందా.. ?

కర్నాటక( Karnataka ) ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ కొంత స్లో అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోతే సౌత్ లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

అందుకే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవలనే పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్గత విషయాలు కొంత కలవర పెడుతున్నాయి.

ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి వాళ్ళు పార్టీలో కొనసాగుతారా ? లేదా పార్టీకి గుడ్ బై చెబుతారా ? అనే అనుమానాలు అధిష్టానంలో కూడా ఉన్నట్లే కనిపిస్తోంది.

అయితే బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఈటెల, కోమటిరెడ్డి, వివేక్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసినప్పటికీ.

అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. """/" / దీనికి కారణం పార్టీ కార్యకలాపాలకు వీరు దూరంగా ఉండడమే.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ " ఇంటినికి బీజేపీ " అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్దిని, పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లె ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు.

అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ " ఇంటింటికి బీజేపీ " కార్యక్రమానికి ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy) దూరంగా ఉన్నారు.

దీంతో మరోసారి వీరి పార్టీ మార్పు పై చర్చ జరుగుతోంది.దీన్ని బట్టి చూస్తే పైపైకి పార్టీ మారేది లేదని ఈ నేతలు చెబుతున్నప్పటికి.

లోలోపల పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో వీరి వైఖరిని గమనించిన బీజేపీ అధిస్థానం ఈటెల, కోమటిరెడ్డి లకు మరోసారి పిలుపందించింది.

"""/" / ఇప్పటికే ఈటెల తో పలు మార్లు బేటీ అయిన బీజేపీ అధిష్టానం.

ఆయన పార్టీ విదకుండా గట్టిగానే ప్రయత్నిస్తోందట.అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చుకునేందుకు ఆయన బ్రదర్ వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy)గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట.

అందుకే ఈ ఇద్దరు నేతలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

పార్టీలో సరైన ప్రదాన్యం దక్కడం లేదని ఈటెల రాజేంద్ర మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు అంటిఅంటనట్టుగా ఉంటూ వస్తున్నారు.

దీంతో వీరు ఏ క్షణంలోనైనా పార్టీ మారిన ఆశ్చర్యం లేదు.అందుకే ఇద్దరి నేతల విషయంలో బీజేపీ కొంత డౌట్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.

మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.

రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?