తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదువే ఉండదు.ఎన్నో వేల ఏళ్లనాటి అత్యంత పురాతనమైన ఆలయాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి.
ఇక వీటిలో ఇప్పటికీ ఎవరు కనిపెట్టని రహస్యాలతో కూడిన కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.వాటిలో బృహదీశ్వరాలయం ఒకటి.
తమిళనాడులోని తంజావూర్( Thanjavur ) లో ఈ పురాతన శివాలయం ఉంది.ఇది చాలా ప్రత్యేకమైనది.
కాబట్టి దీనిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని భక్తులు అనుకుంటూ ఉంటారు.ఇంతకీ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆలయంలో ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివాలయం అయిన ఈ బృహదీశ్వరాలయాన్ని( Brihadeeswara Temple ) చోళ చక్రవర్తి రాజరాజ ఒకటి కాలంలో నిర్మించారు.ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఒట్టిపడుతుంది.అలాగే ఈ ఆలయ నిర్మాణంలో అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతో సహా ఎన్నో అంశాలు కూడా ఉన్నాయి.ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి.
అది ఏంటంటే ఈ ఆలయం యొక్క నీడ ఎక్కడ వెతికిన కూడా కనిపించదు.మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ అస్సలు కనిపించదు.
దాని నీడ కింద పడదు.అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత.
అయితే ఇది ప్రకృతి మర్మమా? అని నిపుణులు ఎంత వెతికిన దీని రహస్యం ఇప్పటికీ తెలియలేదు.ఇక ఇది ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయాల్లో ఒకటి.అయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ నేల మీద పడదు.అయితే ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో శిల్పిని రాజరాజ చోళులు ఈ ఆలయం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందా అని అడగ్గా.
కనీసం నీడ కూడా పడదని బదులిచ్చాడు.ఇక ఈ వింతను చూసి స్వయంగా రాజు శిల్పిని ప్రశంసలతో ముంచెత్తారు.ఇక ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.