తుది దశకు చేరుకున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పకడ్బందిగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఆదేశించారు.
పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండవ రోజు పోలీస్ శిక్షణ కేంద్రంలో కొనసాగుతున్న సర్టిఫికేట్ వెరిఫీకేషన్ ప్రక్రియను పోలీస్ కమిషనర్ గురువారం పరిశీలించారు.ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి ధృవపత్రాల పరిశీలన సజావుగా సాగేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మహిళ అభ్యర్థుల సర్టిఫికేట్స్ ముందుగా పరిశీలించి పంపిస్తున్నట్లు తెలిపారు.
రోజుకు ఏడు వందల మంది చొప్పున వచ్చే అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్స్ క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 6425 మంది అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన కార్యక్రమం జున్ 26 వరకు యధావిధిగా కొనసాగుతుందన్నారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాల్సి వుంటుందన్నారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ట్రైనీ ఏఎస్ఫీ అవినాష్ కుమార్, ఏవో అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.