ఇండియాలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు( Tourist Places ) చాలా ఉన్నాయ.ప్రకృతిని ఆస్వాదించేందుకు అనేక బ్యూటిఫుల్ ప్రదేశాలు ఉన్నాయి.
అలాగే పాతకాలం నాటి ఎంతో చరిత్ర కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి.వీటిని చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా భారతదేశానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.
ఇండియాలో పర్యాటక ప్రదేశాలు ఎక్కవగా ఉన్న రాష్ట్రాల్లో చండీగఢ్( Chandigarh ) కూడా ఒకటని చెప్పవచ్చు.ఎన్నో ప్రముఖ ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం.
చండీగఢ్‌లో సుఖ్నా సరస్సు( Sukhna Lake ) మంచి పిక్నిక్ స్పాట్.3 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఇది విస్తరించి ఉంటుంది.సైబీరియన్ బాతులతో పాటు కొంగలు, అనేక రకాల పక్షులు ఇక్కడ ఉంటాయి.
ఇందులో బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది.జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్( Zakir Hussain Rose Garden ) కూడా చండీఘడ్‌లో చాలా పాపులర్ ప్రదేశం.దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది.105కుపైగా గులాబీరకాలు ఇందులో ఉంటాయి.ఆ తోట నిర్మాణం కూడా చాలా అద్బుతంగా ఉంటుంది.ఇక రాక్ గార్డెన్, టెర్రస్ట్ గార్డెన్ లు చండీగఢ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.
రాక్ గార్డెన్ లో రాళ్లను మాత్రమే కాకుండా రాళ్ల కళాత్మక స్వరూపాన్ని చూడవచ్చు.ఈ తోటలో కృతిమ జలపాతాన్ని కూడా చూడవచ్చు.ఇక టెర్రస్డ్ గార్డెన్ 10 ఎకరాల్లో ఉండగా.ఇందులో మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఉంటుంది.పంజాబీ పాటలను ప్లే చేస్తారు.అలాగే అనేక రకాల పుష్పాలను ఇందులో చూడవచ్చు.
అలాగే చండీగఢ్‌లో కళా సాగర్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తారు.అనేక ఆకర్షణీయమైన డిజైన్లు ఇందులో ఉంటాయి.
ఇక చండీగఢ్ మ్యూజియంలో కాంగ్రా, రాజస్థానీ, మెఘలుల కళాఖండాలను చూడవచ్చు.ఉదయం 10.3 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇది తెరిచి ఉంటుంది.