తెలంగాణలో జరిగిన అభివృద్ధి వాస్తవం కాదా అని మంత్రి కేటీఆర్ అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు.
ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్ అన్న కేటీఆర్ ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ అని చెప్పారు.ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి వచ్చాం అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.ఈ క్రమంలో ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టాలని సూచించారు.