బీజేపీ రాములమ్మ ను ఆ పార్టీ పిలుస్తోందా ? 

గత కొద్ది రోజులుగా మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి( vijayasanthi ) వ్యవహారంపై పార్టీ జోరుగా చర్చ జరుగుతుంది.పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) వ్యవహరిస్తున్నారని, కీలకమైన సభలు, సమావేశాలకు తనకు ఆహ్వానం పంపడం లేదనే అసంతృప్తితో విజయశాంతి ఉన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది.

 Is The Party Calling Bjp Ramulamma Details, Telangana, Brs Party, Congress, Bjp,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆమె బిజెపికి ( BJP )రాజీనామా చేయబోతున్నారనే హడావుడి గత కొద్ది రోజులుగా మొదలైంది.గతంలో బిజెపిలో కీలకంగా విజయశాంతి ఉండేవారు తర్వాత ఆమెకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.

కీలకమైన సమావేశాలకు ఆమెను పిలవకపోవడం, సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కడం తో పాటు, బిజెపి అధిష్టానం పెద్దలకు ఆమె ఫిర్యాదులు చేశారు.అయినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో,  బిజెపి పై అసంతృప్తితో ఉంటున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

Telugu Bandi, Brs, Congress, Ramulamma, Telangana, Telangana Bjp, Vijayasanthi-P

ఈ విషయాలపై విజయశాంతి స్పందించారు.తాను పార్టీ మారుతున్నానని ,మీడియా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోందని, తాను పార్టీ మారుతున్నానో లేదో ఆ ప్రచారం చేసే వారికి తెలియాలని , తాను మాత్రం మహాశివుని కాశీ మహా పుణ్యక్షేత్రంలో ఉన్నారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.అయితే తాను పార్టీ మారుతున్నానన్న వార్తలపై ఆమె సరైన విధంగా స్పందించకపోవడంతో ఆ ప్రచారంలో నిజం ఉందనే వాదన తెరపైకి వస్తోంది.ఈ క్రమంలోని ఆమెకు కాంగ్రెస్ ( Congress ) నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయట.

Telugu Bandi, Brs, Congress, Ramulamma, Telangana, Telangana Bjp, Vijayasanthi-P

తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితే పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆహ్వానాలు పంపిస్తున్నారట.అయితే విజయశాంతి ఇప్పటికే అనేకసార్లు పార్టీలు మారారు .బిజెపిలోకి మూడుసార్లు,  కాంగ్రెస్ లోకి రెండుసార్లు ఆమె వెళ్లారు.మరోసారి ఆమె కాంగ్రెస్ లో చేరినా, ఆశ్చర్యపోనవసరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకోవడం, తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావడం, తదితరు కారణాలతో విజయశాంతి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ఆసక్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube