మన భారతదేశంలో నిమ్మకాయలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు.ఏదైనా కొత్త వస్తువు కొన్న, పూజలు చేసిన, వంటకాలకు ,ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా ఉపయోగిస్తారు.
నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని ప్రజలు నమ్ముతారు.అందుకే నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
అలాగే నిమ్మకాయల( Lemons )కు ప్రతికూలతను తగ్గించే శక్తి ఉంటుందని చెబుతున్నారు.అలాగే ఆలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొని వస్తే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని కూడా చెబుతున్నారు.
పురాణాల ప్రకారం నిమ్మకాయ చరిత్ర వేద యుగం నుంచి ఉంది.లింభాసురుడు అనే రాక్షసుడు శివుడు బ్రహ్మ దేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు.అతడు ప్రజలను వేధించేవాడు.అతడి క్రూరమైన పనులకు ఋషి అగస్త్యుడు భూమిని ఆ రాక్షసుడు నుంచి రక్షించడానికి అతడిని అంతం చేయమని దుర్గామాతను ప్రార్ధించాడు.అందుకు అంగీకరించిన అమ్మవారు సంభరించి భూమిని సస్య శ్రావణం చేశారు.అందుకే అమ్మవారిని శకంబరీ దేవి రూపంలోనూ పూజిస్తారు.
శకంబరీ దేవి( Shakumbhari Devi ) యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్నానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు.
దీంతో అమ్మవారు లింబాసరుడు ఒక వరం ఇచ్చారు.అతను ఎప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరదించబడతాడని వరం ఇచ్చారు.అప్పటినుంచి హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన బలంగా మారిపోయింది అని పెద్దవారు చెబుతున్నారు.
చండీమాత, కాళీమాత ( Kalimath )పూజలలో తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు.నిమ్మకాయ సమర్పిస్తే అమ్మవార్లకు కోపం తగ్గుతుందని చెబుతుంటారు.
అందుకే నిమ్మకాయలు పారవేయకూడడు.ప్రసాదంలా వాడుకోవాలి.
అయితే అవి మనకు ఎలా ఉపయోగపడతాయో అలా వాడుకోవాలి.అలాగే వాటిని ఎరువుగా కూడా వేసుకోవచ్చు.
అందుకే వాటికి ఎంతో డిమాండ్ ఉంది.
DEVOTIONAL