భారీ స్థాయిలో విడుదల కానున్న నాగచైతన్య దూత వెబ్ సిరీస్.. ఈసారైనా హిట్ కొట్టేనా?

ప్రస్తుతం సినిమాలకు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లకి కూడా ఎంతో మంచి ఆదరణ ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.

 Naga Chaitanya Doota Web Series To Be Released On A Huge Scale Details, Nagachai-TeluguStop.com

అయితే అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) సైతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇలా నాగచైతన్య దూత(Dootha) అనే వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే ఇది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Telugu Amazon, Dootha, Dootha Latest, Nagachaitanya, Vikram Kumar-Movie

ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్రర్ నేపథ్యంలో విక్రం కే కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఈ వెబ్ సిరీస్ లో ఈయన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు.అయితే ఈ వెబ్ సిరీస్ కోసం నాగచైతన్య చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.

మొదట అమెజాన్ (Amazon) వారు ఈ వెబ్ సిరీస్ ను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయాలని భావించారు.అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ను ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని భావించిన నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఇతర భాషలలో డబ్ అవుతూ భారీ స్థాయిలో విడుదల కాబోతుందని అందుకే విడుదల ఆలస్యం అవుతుందని తెలియజేశారు.

Telugu Amazon, Dootha, Dootha Latest, Nagachaitanya, Vikram Kumar-Movie

వెబ్ సిరీస్ కోసం తాను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ నాగచైతన్య తన తొలి వెబ్ సిరీస్ దూత గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో కొందరు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కనీసం వెబ్ సిరీస్ ద్వారా ఆయన నాగచైతన్య హిట్ అందుకుంటారా అంటూ కామెంట్ చేస్తున్నారు.నాగచైతన్య నటించిన గత రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే.థాంక్యూ(Thank You) కస్టడీ సినిమా (Custody Movie) ద్వారా నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో ఈయన ఆశలన్నీ కూడా వెబ్ సిరీస్ పైనే ఉన్నాయని తెలుస్తోంది.మరి ఈ వెబ్ సిరీస్ నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube