డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే మరణశిక్షే.. మూడు వారాల్లో రెండో ఉరి, సింగపూర్‌ తీరుపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం

ఎవరెన్ని చెప్పినా.ఎన్ని విమర్శలు వచ్చినా తను పెట్టుకున్న కట్టుబాట్లను, నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తోంది సింగపూర్.

 Singapore Executes Second Man Convicted Of Drug Trafficking In Three Weeks Spark-TeluguStop.com

( Singapore ) నేరాలు, శిక్షల అమలు విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వుంటుంది.చిన్న నేరం చేసినా.

దాని వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని బట్టి అక్కడ శిక్షలు వుంటాయి.ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా విషయంలో మాత్రం కఠినంగా వుంటుంది.

ఏకంగా ఉరిశిక్షను సైతం అమలు చేయడానికి వెనుకాడదు.

గతేడాది ఏప్రిల్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ కు( Drugs Smuggling ) సంబంధించి నేరం రుజువు కావడంతో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కే ధర్మలింగాన్ని( Nagendran K Dharmalingam ) సింగపూర్ ప్రభుత్వం ఉరితీసిన సంగతి తెలిసిందే.

మానసిక పరిస్ధితి బాగోలేదని.క్షమాభిక్ష పెట్టాలని నాగేంద్రన్ కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సింగపూర్ ఏమాత్రం పట్టించుకోలేదు.తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్లుగా ముందుకే వెళ్లింది.

Telugu Narcotics Laws, Changiprison, Penalty, Drug, Drugs, Singapore-Telugu NRI

తాజాగా డ్రగ్స్ రవాణా కేసులో సింగపూర్ మరో వ్యక్తిని ఉరి తీసింది.ఈ తరహా నేరాల్లో గడిచిన మూడు వారాల్లో ఉరిశిక్షను అమలు చేయడం ఇది రెండోసారి.2019లో 1.5 కిలోల గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది.మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు సింగపూర్‌లో కఠినమైన చట్టాలు వున్నాయి.

వీటి ప్రకారం 500 గ్రాముల కంటే ఎక్కువ మొత్తంలో గంజాయిని రవాణా చేస్తే మరణశిక్ష విధించవచ్చు.

Telugu Narcotics Laws, Changiprison, Penalty, Drug, Drugs, Singapore-Telugu NRI

తాజాగా 36 ఏళ్ల సింగపూర్ జాతీయుడికి చాంగి జైలు కాంప్లెక్స్‌లో బుధవారం ఉరిశిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.బాధితుడి కుటుంబం అభ్యర్ధన మేరకు సింగపూర్ సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో అతని పేరును వెల్లడించలేదు.మార్చి 2022లో ఉరిశిక్షలను తిరిగి ప్రారంభించినప్పటి నుంచి 13 మంది ఖైదీలను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం.

అయితే ఉరిశిక్షను రద్దు చేయాలని సింగపూర్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube