నేడు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో కొంతమంది వీటి వలన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం వీటిని వేదికగా చేసుకొని తమ ప్రతిభను ఈ ప్రపంచానికి చాటిచెబుతున్నారు.
ఈ క్రమంలో ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు.ఈ జాబితాలో భారత సంతతకి చెందిన 13 ఏళ్ల హర్నిద్ కౌర్( 13-year-old Harnid Kaur ) అందరికంటే ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.
హర్నిద్ తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా, చిన్న వయసులోనే లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది మరి.
ఆమెది పంజాబీ కుటుంబం.వ్యాపారం నిమిత్తం దుబాయ్ ( Dubai )లో స్థిరపడ్డ ఫామిలీ వారిది.దాంతో హర్నిద్ ఎదుగుదల అంతా అక్కడే జరిగింది.
హర్నిద్కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం కారణంగా ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ దగ్గర శిక్షణ ఇప్పించారు.కొద్ది రోజులకే డ్యాన్స్‌లో మెలకువలను ఒంటబట్టించుకున్న ఈ అమ్మాయి పలు పాటలకు ఇంటి దగ్గర స్టెప్పులేసేది.
హర్నిద్ ప్రతిభను గుర్తించిన ఆమె తల్లి డ్యాన్స్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయమని సలహా ఇవ్వగా అలా రెండేళ్ల క్రితం ‘beatswithharnidh’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఆమె తెరిచింది.
ఇంకేముంది, కట్ చేస్తే ఆమె పలు బాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ చేసి.ఆ వీడియోలను అందులో పోస్ట్ చేయడం ఆరంభించింది.దాంతో హర్నిద్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరచిన ఏడాదిలోనే లక్ష మందికి పైగా ఫాలోయర్లను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఆమె దుబాయ్ లోని యంగెస్ట్ సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ల జాబితాలో స్థానం సంపాదించింది.అంతేకాకుండా ‘బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (జూనియర్)’ కేటగిరిలో ‘గల్ఫ్ ఎఛీవర్స్ అవార్డ్‘ కూడా దక్కించుకుంది.
ఈ క్రమంలో- వివిధ ఉత్పత్తుల ప్రచారకర్తగా లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.ఇలా తనదైన నాట్య ప్రతిభతో హర్నిద్ చిన్న వయసులోనే కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం.