సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లకు, నిర్మాతలకు డైరెక్టర్ లకు అలాగే సింగర్ లకు సంగీత దర్శకులకు సినిమాలు సక్సెస్ అయినప్పుడు అవార్డులను అర్థం చేసుకుంటూ ఉంటారు.కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నప్పటికీ కనీసం ఒక్క అవార్డు కూడా రాకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు.
ఇప్పటికే అలాంటివారు గతంలో పలు ఇంటర్వ్యూలలో వారి ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.తాజాగా కూడా ఒక ప్రముఖ సింగర్( Singer ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆవేదంలో వ్యక్తం చేసింది.
మరి ఆ సింగర్ ఎవరు ఆమె ఎందుకు ఆవేదన వ్యక్తం చేసింది అన్న విషయాల్లో వెళితే.

ఒకప్పటి సీనియర్ ఫిమేల్ సింగర్ బి రమణ.( Singer B Ramana ) ఈమె అప్పట్లో కొన్ని వేలపాటలు పాటి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అంతేకాకుండా 1960-90 మధ్య కాలంలో తన మధురమైన స్వరంతో పాటలు పాడి అందరినీ ఉర్రూతలూగించింది.
తెలుగులోనే కాకుండా సౌత్ లో ఉన్న భాషలన్నింటిలో పాటలను ఆలపించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా సింగర్ బి రమణ మాట్లాడుతూ.నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంతే చాలా ఇష్టం.
ఎక్కడికి వెళ్లినా కూడా మొదటి బహుమతి నాకే వచ్చేది.రెండవ బహుమతిని నేను ఎప్పుడు ఇష్టపడేదని కాదు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌత్ లో అన్ని భాషల్లో మంచి మంచి పాటలను పాడాను.అలాగే దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో( SP Balasubramanyam ) కలిసి చాలా డ్యూయెట్ సాంగ్స్ పాడాను.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు.అయితే సింగర్ గా కొన్ని వేల పాటలు పాడిన నాకు కనీసం ఒక్క అవార్డు కూడా రాకపోవడం బాధాకరం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నేను చాలామందిని కళ్ళతో చూస్తే చాలు అనుకున్నాను అలాంటిది వారితో కలిసి పాటలు పాడే అవకాశం నాకు దక్కింది అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.అది నాకు దక్కిన అరుదైన గౌరవం తృప్తి అని చెప్పుకొచ్చింది బి.రమణ.







