ఏజెంట్ ప్రమోషన్ కోసం రిస్క్ చేస్తున్న అఖిల్...172 అడుగుల ఎత్తు నుంచి వేలాడుతూ?

అఖిల్ తాజాగా ఏజెంట్(Agent) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఎన్నో అంచనాల నడుమ అఖిల్ (Akhil)ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Akhil Risking For Agent Promotion Hanging From A Height Of 172 Feet , Agent, Akh-TeluguStop.com

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అఖిల్ భారీ రిస్క్ చేయడం అందరిని కొంత ఆందోళనకు గురిచేస్తుంది.అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఎత్తగానో కష్టపడ్డారు అయితే ప్రమోషన్లకు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్న అఖిల్ తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అఖిల్ చేసిన రిస్కీ స్టంట్ ఫ్యాన్స్ లో హార్ట్ బీట్ పెంచేసింది.అఖిల్ చేసిన వైల్డ్ స్టంట్ అంటూ చిత్ర యూనిట్ వీడియో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా విజయవాడలోని పివిపి మాల్ లో 172 అడుగుల ఎత్తు నుంచి వేలాడుతూ కిందిగి దిగారు.ఈ సినిమా టీజర్ లో చూపించిన విధంగా గుండెలను బాదుకుంటూ అభిమానులను ఉత్సాహపరిస్తూ అఖిల్ చేసిన ఈ స్టంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సినిమా కోసం ఈ విధంగా ఎంతో కష్టమైనటువంటి సన్నివేశాలలో నటించిన అఖిల్ ఈ సినిమాని సక్సెస్ చేసుకోవడం కోసం ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారని ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.ఇక అఖిల్ ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన ఉన్నాయి.

ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేదు.ఇక ఈ సినిమా సక్సెస్ అందుకుంటేనే అఖిల్ కెరియర్ గాడిలో పడుతుందని లేకపోతే ఈయన కెరియర్ ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube