యువ ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా దుమ్ము రేపుతున్న సీనియర్ ఆటగాళ్లు..!

ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆసక్తికరంగా మారింది.అయితే యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్ వేదికగా మారింది.

 The Senior Players Are Competing With The Young Players , Senior Players , Mohi-TeluguStop.com

ఐపీఎల్ లో ప్రతిభ చాటితే చాలా సులువుగా జాతీయ జట్టులో ప్రవేశించేందుకు అవకాశాలు వస్తాయి.ఈ సీజన్లో యువ ఆటగాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా సీనియర్ ఆటగాళ్లు కూడా తమలో ఇంకా సత్తా మిగిలే ఉందని చెలరేగి రాణిస్తున్నారు.

జాతీయ జట్టు నుండి రిటైర్డ్ అయిన ఆటగాళ్లు, వయసు ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తూ, యువ ఆటగాళ్లకు ధీటుగా నిలుస్తున్నారు.ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్లో సీనియర్ల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది మహేంద్రసింగ్ ధోని గురించే, ఆ తరువాత పంజాబ్ జట్టు కెప్టెన్ షికార్ ధావన్, గుజరాత్ జట్టు బౌలర్ మోహిత్ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా, ముంబై జట్టు స్పిన్నర్ చావ్లా ఆటగాళ్లు, యువ ఆటగాళ్లకు దీటుగా నిలబడి రాణిస్తున్నారు.

మహేంద్రసింగ్ ధోని

: 41 ఏళ్ల ధోని ఈ సీజన్లో ఆఖరి ఓవర్లలో బరిలోకి దిగి ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధిస్తున్నాడు.నాలుగు మ్యాచ్లలో ఆరు సిక్సర్లు కొట్టి 58 పరుగులు చేశాడు.

మామూలుగా అయితే వయసు పెరిగే కొద్దీ స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది.కానీ ధోని అందుకు విరుద్ధంగా స్ట్రైక్ రేట్ తో దుమ్మురేపుతున్నాడు.

Telugu Amit Mishra, Latest Telugu, Mohit Sharma, Msdhoni, Piyush Chawla, Senior,

శిఖర్ ధావన్:

37 ఏళ్ల ధావన్( Shikhar Dhawan ) పంజాబ్ జట్టు కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్నాడు.ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లలో 23 పరుగులు సాధించాడు.ఇందులో 99 పరుగుల ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది.ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సీనియర్ ఆటగాడు శిఖర్ ధావనే.

అమిత్ మిశ్రా

: 40 ఏళ్ల అమిత్( Amit Mishra ) లక్నో జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తు, రెండు మ్యాచ్లలో ఆడి మూడు వికెట్లు తీశాడు.ఎకానమీ 6.83 గా ఉండడం విశేషం.

Telugu Amit Mishra, Latest Telugu, Mohit Sharma, Msdhoni, Piyush Chawla, Senior,

పీయూష్ చావ్లా

: 34 ఏళ్ల ఫిష్ ( Piyush Chawla )ఈ సీజన్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ, నాలుగు మ్యాచ్లలో నాలుగు వికెట్లు తీశాడు.ఇందులో ఒకే మ్యాచ్లో మూడు వికెట్లు తీశాడు.

Telugu Amit Mishra, Latest Telugu, Mohit Sharma, Msdhoni, Piyush Chawla, Senior,

మోహిత్ శర్మ

: 32 ఏళ్ల మోహిత్ ఈ సీజన్లో గుజరాత్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ, నాలుగు ఓవర్లకు 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube