కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు.ఈ సర్కార్‌లో ఈ రెండు నిత్యవసరాల ధరలు బగ్గు మంటున్న వేళ సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.
గ్యాస్ సిలిండర్ ధరలు(Gas Cylinder ) పెరిగిపోయి చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో( Cash Back Offers ) గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు పేమెంట్ యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
అటువంటి యాప్‌లలో పేటీఎం (Paytm) ఒకటి.
ఈ యాప్ ప్రోమో కోడ్ ‘FREEGAS’ని ఉపయోగించి చేసిన గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లకు రూ.1000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది.ఈ కోడ్‌ని ఉపయోగించే ప్రతి 500వ కస్టమర్ క్యాష్ బ్యాక్ అందుకుంటారు.
ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.అంటే ఇది ఒక లిమిటెడ్ ఆఫర్ అని చెప్పవచ్చు.
క్యాష్ బ్యాక్ మొత్తం 24 గంటల్లో మీ పేటీఎం వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది.
ఈ క్యాష్ బ్యాక్ గెలిస్తే కేవలం రూ.155కే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.మరి ఆ అదృష్టం మిమ్మల్ని వరిస్తుందో లేదో చెక్ చేసుకోండి.
తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధర 1100కు పైగానే ఉంది.గతంలో దీని రేటు చాలా తక్కువగా ఉండేది కానీ ఈ మధ్య చాలా వరకు పెరిగింది.
పెరిగిన ధరల భారాన్ని మోయలేని వారు పేమెంట్ యాప్స్ ఆఫర్ చేసే ప్రత్యేక డీల్స్ ద్వారా తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.