తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు.
మరి ముఖ్యంగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్( Sukesh Chandrashekhar ) కేసు విషయంలో ఈమె పేరు కీలకంగా మారిన విషయం తెలిసిందే.దీంతో కొద్ది రోజుల పాటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె పేరు మారుమోగిపోయింది.
తాజాగా ఈ కేసు విషయంలో మరోసారి ఈమె పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజాగా సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యింది జాక్వెలిన్.
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈమె బుధవారం పటియాల హౌస్ కోర్టుకు( Patiala House court ) హాజరయ్యింది.గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి కేసులో కోర్టు విచారణ జరిపింది.
ఈ క్రమంలో కోర్టు దగ్గర తెగ హడావిడి చేసింది జాక్వెలిన్.ఇక ఈ కేసులో గురువారం అనుబంధ చార్జిషీట్ దాఖలుచేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను కోర్టు ఆదేశించింది.ఈ విషయంపై ఈ నెల 18న మరోసారి విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది.
కాగా 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న బిజినెస్ మెన్ సుకేశ్ చంద్రశేఖర్ ఆయనతో జాక్వెలిన్ కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆమెపై ఈ కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఈ విషయంలో ఈడీ ఇప్పటికే చాలా సార్లు జాక్వెలిన్ ను విచారించింది.అంతేకాకుండా సుకేష్ నుంచి జాక్వెలిన్ కు చాలా సార్లు విలువైన బహుమతులు కూడా అందినట్టు ఈడీ తెలిపిన విషయం తెలిసిందే.అంతేకాకుండా వీరిద్దరు కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ కేసులో ఆమె పాత్ర పై పలు ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.ఇప్పటికీ ఈ విషయంపై పలుసార్లు స్పందించిన జాక్వెలిన్ కావాలనే ఈ కేసులో తనను కావాలని ఇరికించారని,
తనలైఫ్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తోంది.సుకేశ్ హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని తనను తప్పుదారి పట్టించాడని తెలిపింది.జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేవాడని, కానీ జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని వెల్లడించింది.ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటోంది జాక్వెలిన్.
చంద్రశేఖర్ కేసు విషయంలో కేవలం జాక్వెలిన్ పేరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు కూడా వినిపించిన సంగతి తెలిసిందే.మొత్తానికి సుకేష్ చంద్రశేఖర్ కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.