టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు.ఇక ఈయన తాజాగా మీటర్(Meter) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇదే రోజున హీరో రవితేజ(Raviteja) నటించిన రావణాసుర సినిమా(Ravanasura Movie) కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇక మీటర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కిరణ్ అబ్బవరం తన భుజాలపై వేసుకొని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కిరణ్ అబ్బవరం ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.ఈ క్రమంలోనే కొందరు రవితేజ అభిమానులు కిరణ్ అబ్బవరం కు షాక్ ఇచ్చే ప్రశ్నలు అడుగుతూ ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు.సాధారణంగా ఒకే రోజున రెండు మూడు సినిమాలు విడుదలవుతే పెద్ద ఎత్తున సినిమాల మధ్య పోటీ ఉంటుంది.అయితే రవితేజ, కిరణ్ అబ్బవరం సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నప్పటికీ ఇద్దరు హీరోల మధ్య పెద్ద పోటీ లేదనే చెప్పాలి.
రవితేజ సీనియర్ స్టార్ హీరో కిరణ్ అబ్బవరం ఈ మధ్యకాలంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద పోటీ లేదని చెప్పాలి.

ఇక నేటిజన్స్ సైతం ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరంని ప్రశ్నించారు.రవితేజ సినిమాకు పోటీగా మీటర్ సినిమాని(Meter Movie) విడుదల చేస్తున్నారా అంటూ ఒక నేటిజన్ ప్రశ్నించగా కిరణ్ అబ్బవరం లేదు అంటూ రిప్లై ఇచ్చారు.రవితేజతో పోటీ నీకు అవసరమా అంటూ మరొక నేటిజన్ ప్రశ్నించగా కిరణ్ అబ్బవరం మాత్రం చాలా కూల్ గా రిప్లై ఇచ్చారు.
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ లేదు అనుకోకుండా ఇది జరిగింది నేను కూడా దీనిని ఊహించలేదు అంటూ ఈయన సమాధానం చెప్పారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







