నిర్మాతగా సినిమాకు డబ్బులు పెట్టడం వరకు ఓకే కానీ ప్రేక్షకుల మనసు గెలిచే సినిమా చేయడం మాత్రం కొద్దిగా కష్టమే.ఎస్.
ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో నిర్మాత సుధాకర్ చెరుకూరి సందీప్ కిషన్( Sandeep Kishan ) తో రన్ సినిమా నిర్మించారు.ఆ తర్వాత రానాతో విరాట పర్వం, రవితేజ( Ravi Teja ) రామారావు ఆన్ డ్యూటీ సినిమాలను నిర్మించారు.ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే చేసిన 3 సినిమాలు నిరాశపరచినా నాని దసరా సినిమాకు మాత్రం అనుకున్న దాని కన్నా ఖర్చు బాగానే పెట్టారు నిర్మాత సుధాకర్.
ఒక నూతన దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే కానీ నాని చెప్పాడని అతని మీద నమ్మకంతో సుధాకర్ అలా చేశారు.
ఫైనల్ గా దసరా రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉండటంతో నిర్మాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.సక్సెస్ లేకపోయినా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలు చేస్తున్న సుధాకర్ చెరుకూరికి దసరా సక్సెస్ టేస్ట్ అందించింది.
కాబట్టి ఇక మీదత మరింత ఉత్సాహంతో సినిమాలు నిర్మిస్తారని చెప్పొచ్చు. కథని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి అలాంటి నిర్మాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంటుంది.