ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ మేరకు మిథిలా స్టేడియంలో అంతా సిద్ధమైంది.అయితే శ్రీసీతారాముల కల్యాణానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది.2016లో చివరిసారి రామయ్య కల్యాణానికి వచ్చిన కేసీఆర్ తరువాత భద్రాద్రికి వచ్చిన దాఖలాలు లేవు.కాగా కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించినప్పటీ నుంచి సీతారాముల కల్యాణానికి పాలకులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిచడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు.