Sidharth Malhotra : మరోసారి జంటగా నటించనున్న రొమాంటిక్ కపుల్.. ఎవరంటే?

బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ కియారా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రా ( Kiara Advani, Siddharth Malhotra )ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలె ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

 Sidharth Malhotra : మరోసారి జంటగా నటించను�-TeluguStop.com

ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ లోని జైసల్మేర్‌ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్దార్థ్ మల్హోత్రా, కియారాలు ఒక్కటైన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ రియల్ లైఫ్ జంట త్వరలోనే రీల్ లైఫ్ లో ఒక సినిమాలో నటించనున్నారు.ఇప్పటికే ఈ జంట పలుసార్లు కలిసి నటించిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Karan Johar, Kiara Advani, Shersha-Movie

త్వరలోనే ఈ జంట మరోసారి జంటగా కనిపించబోతున్నారు.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్టేసారు కరణ్ జోహార్( Karan Johar ).వెండితెర మీద కమర్షియల్ కాంబినేషన్స్‌ సెట్ చేయటంలో కరణ్ జోహార్ స్పెషలిస్ట్‌.ఏ కాంబినేషన్‌లో సినిమా చేస్తే కమర్షియల్‌గా వర్క్ అవుట్ అవుతుందో పర్ఫెక్ట్‌గా తెలిసిన కరణ్ ఇప్పుడు హ్యాపెనింగ్ కపుల్‌ సిద్‌ కియారాలను రంగంలోకి దించుతున్నారు.

అయితే గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సిద్ధార్థ్, కియారా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం వేకెషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Bollywood, Karan Johar, Kiara Advani, Shersha-Movie

ఈ జంటను వెండితెర మీద కూడా జంటగా చూపించేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు కరణ్‌ జోహార్‌.గతంలో ఈ జంట కలిసి నటించిన షేర్షా విమర్శలకు ప్రశంసలు అందుకున్న మెయిన్‌ ప్లాట్‌తో పాటు సినిమాలో సిద్‌ కియారా కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి.అందుకే మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్‌.ప్రజెంట్ కరణ్ జోహార్‌ బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న యోధా సినిమాలో నటిస్తున్నారు సిద్ధార్థ్.కియారా కూడా సౌత్, నార్త్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తయిన వెంటనేఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరి పెళ్లి తరువాత చేయబోయే సినిమా ఈ జంటగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube